Home » వామ్మో.. ‘ప్రాజెక్ట్ కె’ కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ అంత తీసుకుంటున్నాడా..?

వామ్మో.. ‘ప్రాజెక్ట్ కె’ కోసం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ అంత తీసుకుంటున్నాడా..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమా కాస్త నిరాశ పరిచింది. ప్రభాస్ బాహుబలి 2 తరువాత తీసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలన్నీ సక్సెస్ సాధించలేదనే చప్పాలి. ఈ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. సెప్టెంబర్ 28న సలార్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ కే సినిమా అఫిషియల్ టైటిల్, మోషన్ పోస్టర్ రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

Advertisement

సైన్స్ ఫిక్షన్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, హీరోయిన్లు దీపికా పదుకొనే, దివా పఠాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ అఫిషియల్ పోస్టర్ రివీల్ చేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాస్ నటిస్తున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈమూవీలో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో కమల్ కీలకపాత్రలో నటిస్తున్నారని ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలియజేసింది చిత్రయూనిట్. ఇందులో కమల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇక ప్రాజెక్ట్ కె సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మొత్తం భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్ట్మాతకంగా నాగ్ అశ్విన్ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫిల్మ్ లవర్స్. ప్రాజెక్ట్ కే కోసం కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కమల్ విలన్ పాత్రలో నటించనున్నారని.. దాదాపు 20 రోజుల డేట్స్ కూడా కేటాయించారని తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే నాగ్ అశ్విన్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కోసం కమల్ హాసన్ కి దాదాపు రూ.100కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నట్టు సమాచారం. ఇది వాస్తవమా కాదా అనేది క్లారిటీ లేదు. జనవరి 12, 2024న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

దివ్యభారతి మరణం అనంతరం ఆగిపోయిన సినిమాలకు… డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

Dimple Hayathi: వేణుస్వామితో డింపుల్‌ హయతీ ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?

Visitors Are Also Reading