Home » ఆస్కార్ నామినేషన్లకు జక్కన్న పెట్టిన ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ఆస్కార్ నామినేషన్లకు జక్కన్న పెట్టిన ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలు తీసిన తర్వాత ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా దేశాన్ని దాటి మంచి గుర్తింపునిచ్చింది. ఈ మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైన విషయం మనందరికీ తెలిసింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

also read:సాఫ్ట్ వేర్ జాబ్ ఉందని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు….చివరికి ఏం చేశాడంటే…?

ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కి పంపించకపోవడంతో రాజమౌళి టీం ఓపెన్ క్యాటగిరి లో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. ఇందులో ఫైనల్ గా నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొంది చరిత్ర క్రియేట్ చేసింది. ఆస్కార్ అవార్డుకి ఒక్క అడుగు దూరంలో నిలిచిందని చెప్పవచ్చు. ఈ నామినేషన్స్ కోసం జక్కన్న పెట్టిన ఖర్చు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. నాటు నాటు పాట ఆస్కార్ అంత ఈజీగా నామినేట్ కాలేదు. దేశం తరఫున అధికారికంగా పంపించకపోవడంతో రాజమౌళి అండ్ టీం ఎంతో కష్టపడ్డారు.

Advertisement

ఆర్ఆర్ఆర్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చు చేశారట. ఈ నామినేషన్స్ కొరకు దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్క్రీన్సులో స్క్రీనింగ్, గెస్టులకు పిఆర్ మెయింటెన్ మొదలుకొని ప్రతి విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. అయితే చాలామంది మేకర్స్ బడ్జెట్ పెట్టలేకనే ఈ పోటీ నుంచి తప్పుకున్నారట. కానీ రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తించేందుకు వెనకడుగు వేయడం లేదు.

also read:

Visitors Are Also Reading