Home » Sindhooram Movie Review : సిందూరంలో ఎర్ర జెండాపై మాటల తూటాలు ఎలా ఉన్నాయంటే.?

Sindhooram Movie Review : సిందూరంలో ఎర్ర జెండాపై మాటల తూటాలు ఎలా ఉన్నాయంటే.?

by Anji
Ad

సిందూరం అనే టైటిల్ కి తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 1997లోనే పోలీసులు కరెక్టా..? నక్సలైట్లు కరెక్టా..? అని దర్శకుడు కృష్ణవంశీ ప్రేక్షకుడి ఊహకే వదిలేసాడు. అయితే తాజాగా విడుదలైన సిందూరంలో మూవీ మేకర్స్ ఏం చూపించారు..? దర్శకుడు తాను అనుకున్నటువంటి పాయింట్ ని జనాలకు చేరవేశారా..? లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కథ :

సింధూరం కథ అంతా 2003 లో జరుగుతుంది. శ్రీరామగిరి ఏజెన్సీ ఏరియాలో పెత్తందార్లు, భూస్వాముల ఆగడాలు కొనసాగుతాయి. వాటిని సింగన్న దళం ( శివ బాలాజీ) చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అదే సమయంలో ఎమ్మార్వోగా శిరీష రెడ్డి (బ్రిగిడ సాగా) శ్రీరామగిరికి వస్తుంది. అక్కడ నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెకు తోడు కాలేజ్ ఫ్రెండ్ రవి (ధర్మ) ఉంటాడు. ధర్మ నక్సలైట్ ఇన్ ఫార్మర్.. ఆ ఊరిల జరిగే జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా తన అన్న ఈశ్వరయ్య మరణించడంతో ఎమ్మార్వోగా ఉన్నటువంటి శిరీష పోటీ చేయాల్సి వస్తుంది. కానీ అది సింగన్న దళానికి నచ్చదు. శిరీషను సింగన్న దళం ఏం చేసింది ? చివరికి రవి ఏం చేశాడు..? ఈశ్వరయ్యను ఎవరు చంపారు..? చివరికీ రవి తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే మాత్రం థియేటర్లలో ఈ సినిమాను వీక్షించాల్సిందే. 

నటీనటులు  :

Sindhooram: సినిమా చూసి ఆశ్చర్యపోతారు | You will surprise after watching  Sindhooram, says Siva Balaji Kavi

శివబాలాజీ, కేశవ్ దీపక్, బ్రిగిడ సాగా, ధర్మ ముఖేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా, ప్రవీణ్ రెడ్డి జంగ నిర్మాత, హరి గౌర సంగీతం, సుబ్బారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 

Also Read :  వారంలో ఆ రెండు రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ కు వెళ్లని శోభన్ బాబు….ఎందుకో తెలుసా…?

విశ్లేషణ  :

Advertisement

సిందూరం వంటి కథను చెప్పడం అంత సులువైన విషయమేమి కాదు. ముఖ్యంగా నక్సలైట్, ప్రభుత్వం అనే కాన్సెప్టులు..  అందులో పోలీస్ వ్యవస్థ పై ఉండే పలు విమర్శలను చూపించడం కత్తిమీద సాముతో కూడుకున్న పనే అని చెప్పాలి. ఎవ్వరిది తప్పు.. ఎవ్వరిది ఒప్పు అని చెప్పడం కూడా అంత సులభం ఏం కాదు. ఈ చిత్రంలో దర్శకుడు అలాంటి సాహసం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా నక్సలైట్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, కమ్యూనిజం ముసుగులో జరిగే అరాచకాల గురించి చెప్పకనే చెప్పేశారు. హిట్లర్, స్టాలిన్ అంటూ గొప్పగా చెప్పుకునే వారు.. చాలా కోట్ల మంది ప్రాణాలను తీశారని నాటి చరిత్రను రీసెర్చ్ చేసి చెప్పిన తీరు  ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఈ చిత్రం కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పలు డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కమ్యూనిజం గురించి హీరోయిన్ చే చెప్పించిన డైలాగ్స్ చాలా బాగుంటాయి. పాటలు కూడా బాగానే ఉన్నాయి. 2003 నాటి వాతావరణాన్ని తెరపై అద్బుతంగా చూపించడంలో కెమెరా పనితనం కనిపిస్తుంది. ప్రథమార్థం కాస్త స్లోగా అనిపించినప్పటికీ.. ద్వితీయార్థంలో సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. చివరలో వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి.  ప్రధానంగా మేకింగ్ పరంగా నిర్మాతలు ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఈ సినిమాను ఎంతో నిజాయితీగా తీసినట్టు కనిపిస్తోంది. ఎర్రజెండా ప్రేమికులు నొచ్చుకునే విధంగా కొన్ని సీన్లు ఉండడం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. 

Also Read :  RRR : “నాటు, నాటు” పాట డ్యాన్స్ మాస్టర్ గురించి తెలుసా? అతను ఓ టైలర్ షాప్ ఓనర్

ప్లస్ పాయింట్స్ 

  • శివ బాలాజీ నటన
  • బ్రిగిడ సాగా పాత్ర
  • ధర్మ ముఖేష్ కామెడీ

మైనస్ పాయింట్స్ 

  • ప్రథమార్థం స్లోగా సాగదీయడం
  • కమ్యూనిజానికి వ్యతిరేకంగా కొన్ని సీన్లు

రేటింగ్ :

2.75/5

Also Read :  Breaking : మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి పద్మశ్రీ….!

Visitors Are Also Reading