Home » సాఫ్ట్ వేర్ జాబ్ ఉందని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు….చివరికి ఏం చేశాడంటే…?

సాఫ్ట్ వేర్ జాబ్ ఉందని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు….చివరికి ఏం చేశాడంటే…?

by AJAY
Published: Last Updated on

తనకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉందని మాయమాటలు చెప్పి టెకీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగా నే సాగింది. కానీ ఆ తరవాత బోర్ కొట్టిందో ఏమో గానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తో నాకు సంబంధం లేదంటూ భార్య ను హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే…..బెంగుళూరు కు చెందిన నాజ్ 22 అనే యువతి సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది.

కాగా ఆమెకు పశ్చిమ బెంగాల్ కు చెందిన నాసిర్ హుస్సేన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తాను కూడా టెకీ అని అబద్ధం చెప్పి నాజ్ ను నమ్మించాడు. ఆ తరవాత అతడి మాయలో పడిపోయిన యువతి ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే నాజ్ గర్భం దాల్చిన సమయం నుండి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆపరేషన్ చేసుకోవాలని గర్భం తీసుకోవాలని నాజ్ పై నాసిర్ హుస్సేన్ ఒత్తిడి తీసుకువచ్చాడు.

Also read : బాలయ్య నాగ్ ల మధ్య గొడవలు ఆనాటివా… పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిన ఆ గొడవ ఏంటంటే..?

అంతే కాకుండా పుట్టబోయే బిడ్డ తో తనకు సంబంధం లేదని….తన బిడ్డ కాదని అక్రమ సంబంధం అంటగట్టాడు. కాగా నాజ్ ఆపరేషన్ చేసుకోవడానికి నో చెప్పింది. దాంతో నాసిర్ భార్య ను చున్ని తో మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం బెంగుళూరు నుండి డిల్లీ కి పారిపోయాడు. అంతే కాకుండా నాజ్ సోదరుడి కి ఫోన్ చేసి మీ సోదరి అక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే పైకి పంపించాను అని చెప్పాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ని అరెస్ట్ చేశారు. ఘటన పై విచారణ జరుపుతున్నారు.

Visitors Are Also Reading