Home » RRR కంటే ముందు జక్కన్న‌ చేయాలనుకున్న సినిమా ఇదేనట ! చివరి నిమిషంలో ..!

RRR కంటే ముందు జక్కన్న‌ చేయాలనుకున్న సినిమా ఇదేనట ! చివరి నిమిషంలో ..!

by Anji
Ad

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని చెబుతుంటారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి విజయం వెనక మాత్రం ఆయన భార్య రమా రాజమౌళి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రాజమౌళి ఏ సినిమా తెరకెక్కించిన ఆ సినిమా కోసం ఎంతగా కష్టపడతారో.. ఆయన కుటుంబం మొత్తం అదే స్థాయిలో కష్టపడతారు.

rrrmovie

Advertisement

మగధీర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి చిన్న సినిమాలే అయినా మర్యాద రామన్న, ఈగ సినిమాలను తెరకెక్కించారు. ఇక ఆ తర్వాత బాహుబలి సిరీస్ తో కనీవినీ ఎరుగని సక్సెస్ సొంతం చేసుకున్నారు. తర్వాత కూడా ఓ చిన్న సినిమాలు చేయాలని అనుకున్నారట.

అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకోవాలని జక్కన్న భావించారట. రాజమౌళి భార్య రమ రాజమౌళి మాత్రం సినిమా విషయంలో ఏ సినిమా తీస్తే బెస్ట్ అనిపిస్తుందో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రమా రాజమౌళి కామెంట్ వల్ల చిన్న సినిమా తెరకెక్కించాలనుకున్న‌ తన నిర్ణయాన్ని మార్చుకుని ఇద్దరు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement

Also Read :  PRIYANKA JAWALKAR : హీరోయిన్ ఫోటోకు భార‌త క్రికెట‌ర్ అలాంటి కామెంట్….ఇంత‌క‌రువేంటి భ‌య్యా అంటూ ట్రోల్స్..!

ఈ సినిమాకు పనిచేసిన నటులలో ఒకరైనా మకరంద్ దేశ్ పాండే కీలక విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ భుజాలపై కింద చరణ్ ఫైట్ చేసే సీన్ ఇప్పటికీ కళ్లముందు మెదులుతుందని మకరంద్ దేశ్‌పాండే చెప్పారు. ఇక తారక్‌ ఎప్పుడూ సినిమాల గురించి తనతో చర్చించేవాడు అని గుర్తు చేశారు. అంతేకాదు తాను సినిమాలో కచ్చితంగా నటించాలని చెప్పి రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో నన్ను తీసుకొని మంచి రోజులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా యూట్యూబ్ లో సినిమా లీక్ అయిన విషయం తెలిసినదే. అయినా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. వారం రోజుల్లోనే ఎనిమిది వందల కోట్లు క్రాస్ చేసినట్టు సమాచారం. మరి జక్కన్న లవ్ స్టోరీ ఎప్పుడు తీస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read :  అన్ని సినిమాల పోటీ త‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య బొబ్బిలి సింహం..!

Visitors Are Also Reading