Home » అన్ని సినిమాల పోటీ త‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య బొబ్బిలి సింహం..!

అన్ని సినిమాల పోటీ త‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య బొబ్బిలి సింహం..!

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ సినిమాలకు పెట్టింది పేరు. మెసేజ్ బాలయ్య టాలీవుడ్ లో మాస్ అభిమానులను సంపాదించుకున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో ఎన్ని సినిమాలొచ్చినా ఒక్క హిట్టు పడితే చాలు ఇమేజ్‌ పెరిగి పోతూ ఉంటుంది. ఇటీవల బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

బాలకృష్ణ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటేనే అదిరిపోయే మాస్ మసాలా. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తాను ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిన ఉపయోగించుకోలేక పోయానని.. అయితే ఆ లోటు బాలయ్యతో చేసి సూపర్ హిట్లు కొట్టి తీర్చుకున్నానని కోదండరామిరెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. ముఖ్యంగా మంగమ్మగారి మనవడు లాంటి సూపర్ హిట్తో బాలయ్యను మాస్ లో అది కూడా మహిళ ఫ్యాన్స్ కు మరింత దగ్గర చేయడంలో కోదండరామి రెడ్డి కీ రోల్ ప్లే చేశారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ బొబ్బిలి సింహం 1994 సెప్టెంబరు 24 న విడుద‌ల‌ అయిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 7 కోట్ల షేర్ రాబట్టింది కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ బాలయ్యకు జోడీగా అప్పుడు స్టార్ హీరోయిన్లు గా ఉన్న రోజా మీనా నటించారు. ఇందులో రోజా ది నెగిటివ్ పాత్ర గా ఉన్న ఆ పాత్ర సెంటిమెంట్ హృదయాలను పిండేసింది బొబ్బిలి సింహం 60 కేంద్రాల్లో 50 రోజులు 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

Advertisement


ఇక ఈ సినిమాకు పోటీగా కొన్ని సినిమాలు వచ్చాయి ఈ సినిమా విడుద‌ల అవ్వడానికి ఏడు రోజుల ముందుగా రాజేంద్రప్రసాద్ అల్లరోడు రిలీజ్ అయింది. కే అజయ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కామెడీకి పెద్దపీట వేసిన ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా విడుద‌ల అయిన వారం రోజులకు సెప్టెంబర్ 30న ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సూపర్ హిట్ అయ్యింది. ఆమని, జగపతిబాబు, రోజా నటించిన ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇక బొబ్బిలి సింహం సినిమా రిలీజ్ అయిన ఎనిమిది రోజులకు సుమన్ రంభ జంటగా నటించిన హలో అల్లుడు మూవీ వచ్చింది ఈ సినిమా యావరేజ్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ టైంలోనే విక్టరీ వెంకటేష్, రంభ, రమ్యకృష్ణ నటించిన ముద్దుల ప్రియుడు సినిమా వచ్చింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది.

Visitors Are Also Reading