Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కెరీర్ లేదు, డబ్బు లేదు కానీ రాజా రాణి డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణ ప్రియా ఎందుకు ఇష్ట పడింది ? సినిమా కి ఆమెకి ఉన్న సంబంధం..?

కెరీర్ లేదు, డబ్బు లేదు కానీ రాజా రాణి డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణ ప్రియా ఎందుకు ఇష్ట పడింది ? సినిమా కి ఆమెకి ఉన్న సంబంధం..?

by Sravanthi Pandrala Pandrala

తమిళ ఇండస్ట్రీ డైరెక్టర్లలో మంచి గుర్తింపు సాధించారు అట్లీ.. ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా తీసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో దర్శకుడిగా మంచి రేంజ్ సంపాదించుకున్నారు. అలాంటి అట్లీ జీవితంలో ప్రేమ వ్యవహారం అనేది చాలా ఆసక్తికరంగా సాగింది.. మరి ఆ కథ ఏంటో చూద్దాం..తొలి సినిమా రాజారాణితో చిత్ర పరిశ్రమలో తనదైన మార్పు చూపించారు అట్లీ. ప్రముఖ దర్శకుడైన శంకర్ శిష్యుడు అట్లీ. ఇక 2013లో నయనతార,జై ,నజ్రియా, ఆర్య ప్రధాన పాత్రలో వచ్చిన రాజారాణి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అట్లీ ఏ సినిమా తీసినా అందులో బలమైన ప్రేమ కథ ఉంటుంది.

Ad

Also Read:పెళ్లి త‌ర‌వాత విదేశాల‌కు మ‌కాం మార్చిన 10 మంది స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

అలాంటి అట్లీ లైఫ్ లో కూడా బలమైన ప్రేమ కథ ఉంది.. 2014లో ఆయన కృష్ణప్రియను ప్రేమ వివాహం చేసుకున్నారు..కాలేజీలో చదివే రోజుల్లోనే ప్రియా కు నటన సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ సీరియల్స్ లో నటించింది. ఇక అట్లీ రాజ రాణి సినిమా తీయడానికి నటీనటుల కోసం చూస్తున్న సమయంలో కృష్ణప్రియ పరిచయమైంది. ఇద్దరికీ సినీ రంగంపై ఆసక్తి ఉండడంతో స్నేహంగా మారింది. ఇక రాజారాణి సినిమాకు కృష్ణప్రియ అట్లీకి ఎంతో సహకారం అందించింది. రాజారాణి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అట్లీ కృష్ణప్రియ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండేవారు. ఆమెతో మాట్లాడడం కోసం తరచూ వారి టీం తో కలిసి పార్టీలు చేసేవారు.

Also Read:నాగ‌బాబు కూతురు నీహారిక పెళ్లికి క‌ట్నం ఎంత ఇచ్చాడో తెలుసా..?

అలా కృష్ణప్రియ పై అట్లీ స్పెషల్ కేర్ చూపించడం మొదలుపెట్టారు. కానీ ప్రియా స్నేహితుడి లాగానే చూస్తూ వచ్చింది. కానీ అట్లీ ఆమెను ప్రతిసారి స్పెషల్ కేర్ తో ట్రీట్ చేయడం ఆమెకు అర్థమైంది. ఇలా ఓ రోజు ఒక హోటల్లో సరదాగా కూర్చున్నారు. ఈ సమయంలో కృష్ణప్రియ మా నాన్నగారు నా జాతకం చూపించారు అంటూ వారికి చెప్పింది.. మరి నా జాతకం కూడా చూపించక పోయావా అంటూ అట్లీ ఆ సందర్భంగా అన్నారట. దీంతో అందరూ నవ్వారు.. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు.. రాత్రి 12 గంటల సమయంలో కృష్ణప్రియ నుంచి అట్లీకి ఫోన్.. అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించింది. ఊరికే అన్నానని అట్లీ అన్నారు.. ఇక మరుసటి రోజు నుంచి అట్లీ గ్యాంగ్ తో కృష్ణప్రియ కలవకుండా ఒంటరిగా ఉండేది. దీంతో అట్లీ భయపడిపోయారు.

Also Read:భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని అవమానాలు NTR పడ్డారంటే ?

ఆమె తప్పుగా అర్థం చేసుకుంది కావచ్చు అనుకున్నారు. అయితే ఒక ఫ్రెండ్ కు ఈ విషయం చెప్పారు. దీంతో ఆమె కొంతమంది అమ్మాయిలు ఇలానే బ్రతిమిలాడించుకుంటారు. ఆమె మాట్లాడుకుంటే నువ్వే కాల్ చెయ్. లిఫ్ట్ చేయకుంటే పదేపదే కాల్ చేయని చెప్పిందట. అన్నట్టుగానే రాత్రి సమయంలో అట్లీ పదిసార్లు కాల్ చేశారు. కానీ ఆమె పదకొండవ సారి లిఫ్ట్ చేసింది. మళ్లీ అలా జాతకం ఎందుకు చూపించమన్నావు అని ప్రశ్నించింది.. కానీ అట్లీ సరైన సమాధానం ఇవ్వలేదు. ఇక అలా మాట్లాడుతున్న సమయంలో కృష్ణప్రియ ఐ లవ్ యు అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. అలా వారి లవ్ పెళ్లి వరకు వెళ్ళింది.. అయితే వీరి మధ్య పుట్టిన లవ్ బయటకు రావడంతో చాలామంది నెటిజన్లు ఈ కర్రోడికి అంత మంచి అమ్మాయి పడ్డదా అంటూ వివిధ రకాలుగా నిందించారు . అయినా వీరు పట్టించుకోకుండా వారి ప్రేమను గెలిపించుకున్నారు.

Visitors Are Also Reading