Home » నాగ‌బాబు కూతురు నీహారిక పెళ్లికి క‌ట్నం ఎంత ఇచ్చాడో తెలుసా..?

నాగ‌బాబు కూతురు నీహారిక పెళ్లికి క‌ట్నం ఎంత ఇచ్చాడో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరోల్లో ఒక‌రైన నాగ‌బాబు గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు మాత్ర‌మే కాదు.. ప‌లు సినిమాల‌కు నిర్మాత‌. సినీ ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కంటూ ఓ గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి ప‌లువురు హీరోలు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇక అందులో కొంద‌రూ మంచి స‌క్సెస్‌తో రాణిస్తుంటే.. మ‌రికొంద‌రూ అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఒకే ఒక అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఇవి కూడా చ‌ద‌వండి :  భారతీయుడు మూవీ కథలో ఇది గమనించారా.. పెట్టిన బడ్జెట్ కన్నా ఇన్ని రేట్లు వసూలు చేసిందా..?

Advertisement


ఇక ఆమె మ‌రెవ్వ‌రో కాదు.. నాగ‌బాబు గారాల ప‌ట్టి నీహారిక. ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటాల‌ని వ‌చ్చినా అనుకున్న స్థాయిలో ఆమె గుర్తింపు తెచ్చుకోలేద‌నే చెప్పాలి. ఒకే మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయింది. ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ నీహారిక మంచి గుర్తింపు సంపాదించుకుంద‌నే చెప్పాలి. ఆ త‌రువాత రెండు మూడు సినిమాలు చేసినా ఆమెకు అంత మంచి పేరు ఏమి తీసుకురాలేదు. మెగా అభిమానుల‌కు నీహారిక సినిమాలు పెద్ద‌గా న‌చ్చ‌లేద‌నే చెప్ప‌వ‌చ్చు. సినిమాల్లో స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఆమె మూడు ముళ్లు వేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ఉద‌యం అన్నం సాయంత్రం.. రాత్రి అన్నం ఉద‌యం తింటున్నారా..? అయితే ప్ప‌కుండా ఈ విష‌యాలు తెలుసుకోండి..!

 

గుంటూరు మాజీ ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు కుమారుడు చైత‌న్య‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించారు. ఇక పెళ్లికి ముందు నుంచే ఈ జంట హ‌డావిడి చేసింది. డ్యాన్స్‌, పాట‌లు, ఇలా ఎన్నో వేడుక‌లు జ‌రిగాయి. ఇలా ప్ర‌తీ కార్య‌క్ర‌మంలో మెగా హీరోల సంద‌డి.. అమ్మాయి పెళ్లిని వారెవ్వా అనిపించే విధంగా చేశారు. నాగ‌బాబు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నీహారిక‌కు క‌ట్నం బాగానే ఇచ్చార‌ట‌. పెళ్లి కొడుక్కి నేరుగా ఇవ్వ‌కుండా నీహారిక‌కు దాదాపు రూ.10కోట్ల వ‌ర‌కు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. పెళ్లికి న‌గ‌లు, మరో రూ.2కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. నీహారిక పేరు మీద అల్లుడికి ఓ బంగ‌ళా కూడా ఇచ్చాడంట‌. క‌ట్నం అనే పేరు లేకుండా నీహారిక‌కు బాగానే ప్రాప‌ర్టీ అందించాడ‌ట‌. పెళ్లిలో నీహారిక‌కు ఖ‌రీదైన బ‌హుమ‌తులు వ‌చ్చాయ‌ట‌. చిరంజీవి వ‌జ్రాల హారాన్ని అందించాడు. దాని ధ‌ర రూ.2కోట్ల వ‌ర‌కు ఉంద‌ట‌. ఇక అన్న వ‌రుణ్ తేజ్ కూడా చెల్లి కోసం రూ.2కోట్ల విలువ చేసే ఫ్లాట్ గిప్ట్‌గా ఇచ్చాడ‌ట‌. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కూడా ఖ‌రీదైన కారును అందించాడ‌ట‌.

ఇవి కూడా చ‌ద‌వండి :  లైగ‌ర్ సహా బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలిలే…ఎన్ని హిట్ ఎన్ని ఫ‌ట్టో తెలుసా..?

Visitors Are Also Reading