నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మాత్రమే కాదు, రైల్వే కూడా పలు నోటిఫికేషన్స్ జారీ చేస్తూ ఉంటుంది. రైల్వేలో పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ఇవి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి పోస్టులు. డిప్యూటేషన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుంది రైల్వే. మొదట మూడేళ్ల కాలానికి వీరిని నియమిస్తారు. ఆ తర్వాత గడువు పొడిగించే అవకాశం ఉంది. ఆసక్తికర అభ్యర్థులు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Advertisement
READ ALSO : హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు..నెలకు రూ.35 వేల జీతం
రైల్వే అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. రైల్వేకు చెందిన జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. విద్యార్హతల వివరాలు చూస్తే కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిఈ లేదా బీటెక్ పాస్ కావాలి. ఇతర అర్హతలు చూస్తే కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు,
Advertisement
READ ALSO : చిత్ర పరిశ్రమలో మా విషాదం.. ‘మిథునం’ సినిమా నిర్మాత ఆనందరావు మృతి
సెమీ గవర్నమెంట్, స్టాట్యూటరీ, అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: Deputy Secretary, Room No. 110-C Rail Bhavan Raisina Road, New Delhi-110001. ఎంపికైన వారికి న్యూఢిల్లీలో పోస్టింగ్ లభిస్తుంది. ఎంపికైనవారికి రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది. న్యూఢిల్లీలో భారతీయ రైల్వేకు చెందిన రైల్వే బోర్డులో ఈ పోస్టులు ఉన్నాయి. 2023 మార్చి 2న నోటిఫికేషన్ విడుదలైంది. 60 రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ చివరి నాటికి దరఖాస్తులను పంపాలి.
Advertisement
READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !