చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ దిగ్గజనటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొందరు మరణిస్తే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా ‘మిథునం’ సినిమా నిర్మాత ఆనందరావు కాలం చేశారు.
Advertisement
Also Read: చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కంటే ఎక్కువ ఆయనే కృషి చేశారా..?
Advertisement
ఆయన వయసు 57 సంవత్సరాలు. చాలా కాలం నుంచి ఆయన డయాబెటిస్ తో… బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగుపడకపోవడంతో ఆయన వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో తాజాగా ఆయన మరణించారు.
ఆయనకు భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు లక్ష్మీలతో తెరకెక్కిన మిధునం అనే సినిమాకు ఆనందరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆయన అంతక్రియలు వావిలవలసలో తాజాగా జరిగాయి. ఇక ఆనందరావు మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.
Advertisement
READ ALSO : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు