Telugu News » Blog » “పుష్ప” సినిమా ఫస్ట్ రివ్యూ…రేటింగ్ ఎంతంటే…?

“పుష్ప” సినిమా ఫస్ట్ రివ్యూ…రేటింగ్ ఎంతంటే…?

by AJAY
Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్లు విడుదల కాగా భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మొదటి రివ్యూ వచ్చేసింది.

Advertisement

Advertisement

యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధూ ఈ సినిమాను చూసి తన రివ్యును ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉమైర్ తన రివ్యూ ను రాసుకువచ్చారు. సెన్సార్ బోర్డులో సినిమా ప్రదర్శన ముగిసిందని ఆయన పేర్కొన్నారు. పుష్ప సినిమా మొదటి పార్ట్ టెర్రిఫిక్…. రాష్మిక అల్లు అర్జున్ కెమిస్ట్రీ వేరే లెవల్ ఉందంటూ ప్రశంసలు కురిపించారు. వాట్ ఏ పర్ఫామెన్స్ అంటూ ఈ సినిమాపై పొగడ్తల జల్లు కురిపించారు.

Also read : VIRAL VIDEO : బాల‌య్య స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన బుడ్డోడు..!

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం అన్నీ సినిమాను వేరే లెవల్ కు తీసుకెల్లాయని.. టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ సినిమాల్లో పుష్ప ఒకటని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా నేషనల్ అవార్డు వచ్చేలా అల్లు అర్జున్ నటన ఉందని పేర్కొన్నారు. ఇక పుష్ప సినిమాకు ఉమైర్ 4/5 రేటింగ్ ఇచ్చారు.