Telugu News » Blog » అల్లు అర్జున్ ఒక్కడే సూపర్ స్టార్ అంటూ స్టార్ హీరోలకు ఆర్జీవీ సవాల్…!

అల్లు అర్జున్ ఒక్కడే సూపర్ స్టార్ అంటూ స్టార్ హీరోలకు ఆర్జీవీ సవాల్…!

by AJAY
Ads

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ ఏదో ఒక అంశం తో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆర్జీవీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నా ఆ సినిమాల కంటే ఆయన చేసే కామెంట్లే ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. వర్మ ఏ ఇంటర్వ్యూ కు వచ్చినా ఆయన ఏం కామెంట్ చేస్తారు అని ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం వర్మ ఇంటర్వ్యూ ల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కామెంట్లు చేస్తున్నారు. ఒక్కో రోజూ వర్మ వరుస ట్వీట్లు చేస్తుంటారు.

Advertisement

Ramgopal varma

Ramgopal varma

కాగా తాజాగా వర్మ పుష్ప ట్రైలర్ పై బన్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అంతే కాకుండా మిగితా స్టార్ హీరోలకు ఆయన సవాల్ కూడా విసిరారు. వర్మ తాజాగా చేసిన ట్వీట్ లో….. రియలిస్టిక్ క్యారెక్టర్ లలో నటించడానికి భయపడని ఓకే ఒక్క సూపర్ స్టార్ అల్లు అర్జున్. నేను పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, రజిని కాంత్ లకు ఇతర హీరోలకు డేర్ విసురుతున్నా రియలిస్టిక్ పాత్రల్లో నటించాలని….పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్….అంటూ ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

Also read :అల్లు అర్జున్ “పుష్ప” ట్రైల‌ర్ వ‌చ్చేసింది..!

అంతే కాకుండా తన ట్వీట్ లో వర్మ అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ ను షేర్ చేశారు. ఇక వర్మ ట్వీట్ కు ఆయన మెన్షన్ చేసిన హీరోల అభిమానులు అంతా కామెంట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. మా హీరోలపై పడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్ప ట్రైలర్ ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఆకట్టుకోవడం తో బన్నీ ఫ్యాన్స్ తగ్గేదెలా అంటున్నారు.

Advertisement