Home » VIRAL VIDEO : బాల‌య్య స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన బుడ్డోడు..!

VIRAL VIDEO : బాల‌య్య స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన బుడ్డోడు..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా అఖండ సినిమా గురించే వినిపిస్తోంది. డిసెంబ‌ర్ 2న ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యింది. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఇక ఈ సినిమా పాజిటివ్ రివ్యూల‌తో థియేట‌ర్ల‌లో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. బాక్స్ ఆఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది. ఇప్ప‌టికే అఖండ సినిమా వంద కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది కూడా. ఇదిలా ఉండ‌గా అఖండ సినిమాలో బాల‌య్య చెప్పిన డైలుగులు, ఫైట్ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Advertisement

Advertisement

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో బాల‌య్య వేసిన స్టెప్పులు మ‌రో ఎత్తు అనే చెప్పాలి. నిజానికి బాల‌య్య ఎంతో క‌ష్ట‌ప‌డి స్టెప్పులు వేస్తుంటారు. అభిమానుల‌ను అల‌రించేందుకు ఎలాంటి స్టెప్పులు వేసేందుకు అయినా రెడీ అవుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య అఖండ సినిమాలోనూ త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా అఖండ సినిమాలో జైబాల‌య్య పాట సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.ఈ పాట‌కు బాల‌య్య ష‌ర్ట్స్ మార్చే స్టెప్పు మ‌రో హైలెట్ గా నిలించింది.

ఈ పాట‌కు ఏకంగా థియేట‌ర్లో యువ‌తులు లేచి డ్యాన్స్ చేశారు. థియేటర్ లో యువుతులు డ్యాన్స్ చేయ‌డం ఇదే మొద‌టి సారి కూడా. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ బాలుడు జై బాల‌య్య సాంగ్ కు అచ్చం బాల‌య్య లా డ్యాన్స్ చేశాడు. అక్క‌డ బాల‌య్య ష‌ర్ట్ మారిస్తే ఇక్క‌డ బాలుడు కూడా అదే విధంగా ష‌ర్ట్ మారుస్తూ ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌తి స్టెప్పు అచ్చం బాల‌య్య లాగే ఇర‌గ‌దీశాడు. దాంతో ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. బుడ్డోడి టాలెంట్ కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

https://fb.watch/9VTGArgvqR/

Visitors Are Also Reading