Home » పుష్ప మూవీ ఐటమ్ సాంగ్ లో ముందు సమంతని అనుకోలేదట.. ఎవరిని అనుకున్నారంటే..!!

పుష్ప మూవీ ఐటమ్ సాంగ్ లో ముందు సమంతని అనుకోలేదట.. ఎవరిని అనుకున్నారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అల్లు అర్జున్ కెరీర్ లోనే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన సినిమా పుష్ప. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ఒక బెస్ట్ చిత్రంగా చెప్పవచ్చు. అప్పట్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటననే కాకుండా పాటలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. ఊ అంటావా మావా .. ఊ.. ఊ.. అంటావా మావ.. పాట అప్పట్లో ఓ రేంజ్ లో ఊపు ఊపింది. సమంత ఈ పాటలో ఎంతో హాట్ గా కనిపించింది. ఎప్పుడూ కూడా తన అందాలను చూపించని సమంత ఈ పాటలో మొత్తం విప్పి చూపించింది.

Advertisement

ముఖ్యంగా ఈ సినిమాకు ఆమె స్పెషల్ సాంగ్ కూడా ఎంతగానో కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా స్పెషల్ సాంగ్ కు ముందుగా సమంతని అనుకోలేదట. మరి ఎవరిని అనుకున్నారో ఇప్పుడు చూద్దామా.. పుష్ప సినిమాలో ఈ పాట కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అనుకున్నారట. ఆ తర్వాత అల్లు అర్జున్ పర్సనల్ సజెషన్ ఇవ్వడంతో తెలుగు హీరోయిన్ ని పెట్టుకుందామనే ఆలోచనకు వచ్చారట. ఇక తెలుగు హీరోయిన్లలో అంతగా ఎక్స్పోజింగ్ ఇచ్చే పలువురు హీరోయిన్ల పేరు ఆలోచించి చివరికి సమంతను ఫైనల్ చేశారట.

Advertisement

ఇదే టైంలో సమంత డైవర్స్ ఇష్యూ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ టైంలోనే ఈమె ఆ పాట చేయడంతో సినిమాకి పిచ్చ క్రేజ్ వచ్చింది. వీరు అనుకున్నదే తడవుగా సమంతకు కాల్ చేయడంతో ఆమె ఓకే చెప్పిందట. కేవలం ఒక్కరోజులోనే పాట షూటింగ్ కంప్లీట్ చేసేసారట. ఈ విధంగా సమంతను సుకుమార్ ఐటమ్ బాంబుగా చూపించారని చెప్పుకోవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading