Home » Priyanka chopra: నాకు 17 ఏళ్ళు.. నా భర్త నన్ను చూస్తూ ఆ పని చేశాడు..!!

Priyanka chopra: నాకు 17 ఏళ్ళు.. నా భర్త నన్ను చూస్తూ ఆ పని చేశాడు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా అంటే తెలియని వారు ఉండరు. ఈమె పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె భర్త నిక్ జోనస్. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో మెరుస్తూనే ఉంటారు. అయితే ఈ జంట మధ్య దాదాపు పదేళ్ల వయస్సు తేడా ఉంది. అయినా వయసుతో పనిలేదంటూ నిరూపించారు ఈ దంపతులు. ఇద్దరు ప్రేమించుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ప్రియాంక చోప్రా కంటే నిక్ 10 సంవత్సరాలు చిన్న వ్యక్తి. వీరి జంటను ఎవరు చూసినా ప్రియాంక నిక్ జోనస్ కు అక్కలా ఉంది అంటారు. అలాంటి కామెంట్స్ ను వీరు పట్టించుకోరు. అయితే ఈ జంట సరోగసి ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. అయితే అమెరికాకు కోడలిగా వెళ్లిన తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది. అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. ఈమధ్య ఆమె నటించిన సిటాడెల్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికి తెలియని ఒక విషయాన్ని బయట పెట్టింది.

Advertisement

నా భర్తకు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు నాకు 17 ఏళ్లు. నేను మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లాను. ఆ టైంలో నా షో ను చూస్తూ ఏడు సంవత్సరాలు ఉన్న నిక్ చాలా ఎంజాయ్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా మా అత్తగారే చెప్పారని ప్రియాంక చోప్రా తెలియజేసింది. దాదాపు 22 ఏళ్ల క్రితం జరిగిన ఘటన అది. అప్పుడు నా వయసు 17 ఏళ్లు కాగా నిక్ వయసు ఏడు సంవత్సరాలు. చాలా విచిత్రంగా ఉంది కదా అంటూ ప్రియాంక నవ్వులు చిందించింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading