Home » రైతులు ఇలా చేశారంటే లక్షల్లో ఆదాయం..!!

రైతులు ఇలా చేశారంటే లక్షల్లో ఆదాయం..!!

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది తెలుగు రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పల్లి ఇలాంటి పంటలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇలాంటి పంటలను వదిలిపెట్టి ఇంటిగ్రేటెడ్ ఆర్టికల్చర్ చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.. మరి ఆ పంటలు ఏంటో చూద్దామా.. ముఖ్యంగా సాగుతో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అరటి అనేది ఉష్ణ మండల పంట. ఇది తేమతో కూడిన లోతట్టు ప్రాంతాలలో బాగా ఎదుగుతుంది. అరటి సాగు చేయాలనుకునే రైతులు సాగులో మంచి పద్ధతులు పాటిస్తే చాలు అనేక లాభాలు పొందవచ్చు.

Advertisement

ముఖ్యంగా దాని సాగుపై అవగాహన రసాయనాల వినియోగంపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా నాణ్యమైనటువంటి అరటి పండ్లను పొందడానికి మనం పండించే పంట విధానం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండాకాలంలో నీటిని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్వహణ పద్ధతులు అవలంబించాలి. 50,000 ఖర్చు చేస్తే లక్ష వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

Advertisement

 

ప్రభాకర్ అనే ఒక రైతు పది ఎకరాలలో అరటి పంట పండించడం వల్ల ఏటా 5 లక్షల వరకు సంపాదన వస్తోందట. 50వేల ఖర్చుతో ఉత్పత్తి చేసిన అరటి పండ్లను మార్కెట్లో విక్రయిస్తే లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. హెక్టారుకు దాదాపు 3100 మొక్కలు నాటారు. అనేక సంప్రదాయ పద్ధతులు ఉపయోగించి అరటి సాగును చేయడం వల్ల లక్షల రూపాయల్లో లాభాలు వస్తాయని మార్కెట్లో అరటి పండ్ల కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పంటలను రైతులు ఎంచుకోవాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading