Home » జయ‌సుధ‌పై ఆ నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

జయ‌సుధ‌పై ఆ నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

by Anji
Ad

సినీ న‌టి, అల‌నాటి హీరోయిన్ జ‌య‌సుధ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయితే తాజాగా జ‌య‌సుధ ఓ ప్ర‌ముఖ ఇంట‌ర్వ్యూ ఛాన‌ల్‌లో అవార్డుల విష‌యం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించింది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మాలాంటి వాళ్లు పద్మశ్రీ అవార్డులకు పనికి రామని అనడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా ఈమె వైపు చూస్తోంది. ఈ విషయంపై సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు.

Advertisement

ఇలాంటి విషయాలు మాట్లాడడం కరెక్టే అని.. ఆ హక్కు మీకు ఉంది అని.. ప్రతిభ ఉండి అవార్డు రాలేదని అడుగుతున్నారు బాగానే ఉంది. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నంద‌మూరి బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ చేసిన నటనకు నంది అవార్డు ఎందుకు రాలేదని అడిగారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటంటే శ్రీరామరాజ్యం సినిమాకు నంది అవార్డు ఇవ్వాలని కమిటీ ఏకాభిప్రాయం తీసుకోగా.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండ‌డంతో రాముడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు అంతా ఒక్కటే కాబట్టి ఆ సినిమాకి అవార్డు ఇవ్వకూడదని ఆ పేరును కొట్టి పారేసినట్లు తెలియజేశారు. ఆ అవార్డును మ‌రో హీరోకి ఇచ్చినట్టు గుర్తు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్ర‌స్తుతం ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ అవార్డులు అంద‌జేసే స‌మ‌యంలో శ్రీ‌ రామరాజ్యం సినిమా ఏ క్యాటగిరిలో కూడా అవార్డును ప్రకటించలేదు. అంతేకాకుండా రాముడు కృష్ణుడికి సంబంధించి ఎటువంటి చిత్రం వచ్చినా కూడా ఆ సినిమాలకు అవార్డు ఇవ్వలేదని తెలిపారు. ఎందుకంటే అవన్నీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని వాళ్ళ అభిప్రాయమ‌ని వెల్ల‌డించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇస్తుందనుకుంటే.. అప్పుడు కూడా అలానే చేశారు. ఆ సమయంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి మీరు ఎందుకు మాట్లాడలేదు అని తెలిపారు.. ఇతరుల విషయంలో మాట్లాడాలంటే అది కుదరదు. నాయకుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలని కామెంట్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. మరి ఈ నిర్మాత చేసిన కామెంట్లపై జయప్రద ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read: 

తొట్టెంపూడి వేణు బాలయ్యకు అంత దగ్గరి బంధువా… వరసకు ఏమవుతాడు అంటే…?

నరసింహ నాయుడు సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీశారని తెలుసా…? ఎక్కడ జరిగిందంటే…?

 

Visitors Are Also Reading