Home » నరసింహ నాయుడు సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీశారని తెలుసా…? ఎక్కడ జరిగిందంటే…?

నరసింహ నాయుడు సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీశారని తెలుసా…? ఎక్కడ జరిగిందంటే…?

by AJAY
Ad

యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ పెట్టింది పేరు. ఎన్నో ఫ్యాక్ష‌న్ సినిమాల‌లో నటించి బాలయ్య మాస్ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు బి.గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ కు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప‌లు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అలా బి. గోపాల్ బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన నరసింహనాయుడు సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

వంద‌కు పైగా థియేటర్లలో ఈ సినిమా 100 రోజులు ఆడింది. 105 థియేటర్లలో వంద రోజులు ఆడిన సినిమాగా నరసింహనాయుడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ అందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా 2001 సంక్రాంతి బరిలో దిగింది. అయితే అదే ఏడాది సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటించిన మృగరాజు సినిమాతో పాటు వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలు విడుదలయ్యాయి.

Advertisement

narasimhanayudu

narasimhanayudu

కానీ నరసింహనాయుడు ప్రభంజనానికి ఈ రెండు సినిమాలు నిలవలేకపోయాయి. ఇలా ఉండగా ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించారు. అయితే ఈ కథను చిన్నికృష్ణ ఓ నిజ సంఘటన ఆధారంగా చేసుకుని రాసినట్టు తెలుస్తోంది. అప్పట్లో బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామం పైకి కొంతమంది దుండగులు దాడికి వచ్చేవారు. దాంతో ఆ గ్రామంలోని ప్రజలంతా ఓ నిర్ణయం తీసుకున్నారు.

narasimhanaidu-mrugaraju

narasimhanaidu-mrugaraju

దుండగులను ఎదిరించడానికి ప్రతి ఇంటి నుండి ఓ అబ్బాయిని తీసుకుని ఓ చిన్నపాటి సైన్యాన్ని తయారు చేసుకున్నారు. ఈ క‌థ న్యూస్ పేప‌ర్ లో వ‌చ్చింది. ఇక ఈ వార్త చ‌దివిన త‌వార‌త అదే లైన్ పట్టుకుని చిన్నికృష్ణ నరసింహనాయుడు కథను రాసుకున్నారట. ఆ తర్వాత పరుచూరి బ్రదర్ సహాయంతో ఆ కథకు మెరుగులు దిద్దారు. అలా వచ్చిన నరసింహ‌నాయుడు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే సినిమాగా మిగిలిపోయింది.

ALSO READ:తొట్టెంపూడి వేణు బాలయ్యకు అంత దగ్గరి బందువా… వరసకు ఏమవుతాడు అంటే…?

Visitors Are Also Reading