ఇటీవల నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ షూటింగ్ లో నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవే మాట్లాడుకునే వాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బాలయ్య చేసిన కామెంట్లపై ఇప్పటికీ అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాజాగా ఎస్వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు.
Advertisement
‘నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం ఉంది. మేము ఒక కుటుంబంగా ఉంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను ప్రజలను కోరుకుంటున్నాం’ అని నోట్ లో పేర్కొన్నారు.
Grandsons of Late SV Ranga Rao garu says there is nothing objectionable in Nandamuri Balakrishna’s speech.
“Our family is very close to Balakrishna garu. We are like a family” pic.twitter.com/P4dx2E7kz4
— MIRCHI9 (@Mirchi9) January 25, 2023
read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !