Home » చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కంటే ఎక్కువ ఆయనే కృషి చేశారా..?

చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కంటే ఎక్కువ ఆయనే కృషి చేశారా..?

by AJAY
Ad

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జమున రీసెంట్ గా కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జమున ఈ లోకాన్ని విడిచారు. జమున ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా సినిమాలు చేశారు. అంతేకాకుండా అప్పట్లో సత్యభామ పాత్రతో ఎంతో గుర్తింపు తెచ్చుకుని ..ఆ పాత్ర పేరు చెబితేనే జమున గుర్తుకు వచ్చే స్థాయిలో అద్భుతమైన నటనను కనబరిచారు.

Also Read: రాజమౌళి ఈ స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..? 

Advertisement

 

పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల రేంజ్ లో జమున కూడా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాల్లో ఎంతో సక్సెస్ అయిన జమున ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వల్ల అప్పట్లోనే వార్తల్లో నిలిచేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సైతం జమున పై ఏడాది పాటు బ్యాన్ విధించారు.

Also Read: శర్వానంద్ కు కాబోయే భార్య అన్ని కోట్లకు వారసురాలా…?

Advertisement

తమకు గౌరవం ఇవ్వడం లేదని…షూటింగ్ కు ఆలస్యం గా వచ్చినా స్వారీ చెప్పదు అని చెబుతూ జమునను ఏడాది పాటు తమ సినిమాల్లో బ్యాన్ చేశారు. అయితే జమున మరణించడంతో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలిరావడానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల పాత్ర పై జమున స్పందించారు. ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలిరావడానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృషి చేశారని చెప్పుకుంటారు కానీ అందులో వారి కృషి ఏమీ లేదంటూ జమున వ్యాఖ్యానించారు.

Also Read: చిరు, బాలయ్యలో ఉన్న కామన్ పాయింట్.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

 

మొదట హైదరాబాద్ కు ఇండస్ట్రీని తీసుకువచ్చింది గంగాధర్ గారు అని చెప్పారు. గంగాధర్ గారు సారథి స్టూడియోలో మా ఇంటి మహాలక్ష్మి సినిమా చిత్రీకరణ జరిపారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తీసిన మొదటి సినిమా అదేనని అన్నారు. అప్పట్లో సారథి స్టూడియో కు చుట్టుపక్కల సరైన హోటల్ లు కూడా ఉండేవి కాదని అన్నారు. స్టూడియోలోనే రూమ్ లు ఇస్తే అక్కడే ఉండేవాళ్ళమని చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇండస్ట్రీని తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading