ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది దాధాపుగా కనుమరుగు అయిపోయింది. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కొనసాగుతుంది. కానీ 2018 ఎన్నికల తర్వాత చాలా మంది కాంగ్రెస్ నాయకులూ కారు ఎక్కిన కొంతమంది సీనియర్ నాయకులూ మాత్రం హస్తం దించడం లేదు. అందులో భువగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.
Advertisement
ఈయన సొంత తమ్ముడు.. మునుగోడు ఏమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తాజాగా హస్తంను దించి తన హస్తంలో కమలం పట్టుకొని బీజేపీకి జై కొట్టారు. దాంతో ఇప్పుడు మునుగోడులో బై ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రచారకర్తగా వెంకట్ రెడ్డిని కొంతమంది రెచ్చగొడుతున్నారు. ఆయనను ఎలాగైనా పార్టీ నుండి బయటకు పంపాలని ప్లన్స్ వేస్తున్నారు. కానీ వెంకట్ రెడ్డి మాత్రం ఇక్కడ స్థానిక నాయకులను విడిచి కేత్రస్థాయి నాకయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Advertisement
అయితే ఈ మధ్యే ప్రియాంక గాంధీని కూడా వెంకట్ రెడ్డి కలిశారు. ఆ మీటింగ్ లో మునుగోడు చరిత్ర మొత్తం ఆమె ముందు ఉంచిన వెంకట్ రెడ్డి.. ఎవరెవరు హస్తం విడిచిపెట్టనున్నారో వారి లిస్ట్ ను సాక్ష్యాలతో ఆమె ముందు ఉంచారు. దాంతో వెంకట్ రెడ్డి బలాన్ని అంచనా వేసిన ప్రియాంక గాంధీ ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో వెంకట్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చిన ప్రియాంక.. దక్షిణాదిలో ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ కమిటీలో పదవి ఇచ్చేందుకు కుశ సముఖత చూపినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :