Home » కోహ్లీ ముందు బాబర్ ఇంకా బచ్చా..!

కోహ్లీ ముందు బాబర్ ఇంకా బచ్చా..!

by Azhar
Ad

క్రికెట్ ప్రపంచంలోనే పోలికలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. మంచిగా ఆడే రెండు జట్లలోని ఆటగాళ్లను పోలుస్తూ ఉంటారు. అలాగే బాగా ఆడే ఏ ఆటగాడు అయిన రిటైర్ అయిన తరువాత ఇప్పుడు ఆడుతున్న యువ ఆటగాళ్లలో ఎవరైనా బాగా ఆడితే అతనితో పోలుస్తారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు విరాట్ కోహ్లీతో బాబర్ ఆజాంను చాలా మంది పాక్ క్రికెట్ అభిమానులు పోలుస్తూ పోస్ట్స్ చేస్తుంటారు.

Advertisement

అయితే విరాట్ గత కొన్ని నెలలుగా ఫామ్ లేడు. ఇదే సమయంలో బాబర్ ఎక్కువగా పరుగులు చేస్తుండటంతో.. కోహ్లీ కంటే బాబర్ గొప్ప ఆటగాడు అని కామెంట్స్ చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్. కానీ వారు చేసే కామెంట్స్ ను ఆదేశ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కొట్టిపడేసాడు. కోహ్లీ ముందు బాబర్ ఇంకా పిల్లాడు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే అక్రమ్ మాట్లాడుతూ… క్రికెట్ లో పోలికలు అనేవి కామన్ గా జరుగుతాయి. గతంలో కూడా పాక్, ఇండియా ఆటగాళ్లను పోలుస్తూ కామెంట్స్ చేసేవారు.

Advertisement

కానీ ఇప్పుడు బాబర్ ను కోహ్లీతో పోల్చడం సరికాదు. ఎందుకంటే విరాట్ కు ఉన్న అంతర్జాతీయ అనుభవబం అనేది బాబర్ కు లేదు. విరాట్ ఇప్పటికే మూడు ఫార్మాట్ లలో కెప్టెన్ గా చేసాడు. అలాగే అతను ఇంకా కూడా ఫిట్ గా ఉండి క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి కోహ్లీ ముందు బాబర్ ఓ చిన్నపిల్లాడు అని వసీమ్ పేర్కొన్నాడు. దాంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

భవిష్యత్ కెప్టెన్ గా గిల్..!

ఇండియాను ఓడించడానికి ఇదే సరైన సమయం అంటున్న పాక్ మాజీలు.. ఎందుకు..?

Visitors Are Also Reading