Telugu News » Blog » బిగ్‌బాస్‌ షో నుంచి ప్రియాంక ఔట్.. ఎంత పారితోషకం అందుకుందంటే..

బిగ్‌బాస్‌ షో నుంచి ప్రియాంక ఔట్.. ఎంత పారితోషకం అందుకుందంటే..

by Bunty
Ads

Bigboss Telugu Season 5: బిగ్ బాస్ సీజన్ – 5 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక సీజన్ 5 కూడా తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం… బిగ్ బాస్ నుంచి పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారి లో అతి తక్కువ ఓట్లు ప్రియాంక పడడంతో… ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. సెప్టెంబర్ 5వ తేదీన మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ను  9వ కంటెస్టెంట్ గా ప్రియాంక హౌస్ లోకి అడుగు పెట్టింది.

Advertisement

Also Read: నాగ చైతన్య తో విడాకులు : ట్రోలింగ్ పై సమంత కామెంట్ !

Big boss Telugu 5 priyanka singh remuneration

Big boss Telugu 5 priyanka singh remuneration

అప్పటి నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు 91 రోజులు అంటే 13 వారాల పాటు హౌస్ లో ఉంది ప్రియాంక. ఈవారం ఎలిమినేషన్స్ లో ప్రియాంక ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో… బిగ్ బాస్ హౌస్ లో అతి ఎక్కువ కాలం పాటు ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక సింగ్.

Advertisement

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక షో ద్వారా ఎంత పారితోషికం అందుకున్న విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… బిగ్ బాస్ షో యాజమాన్యం ప్రియాంకకు వారానికి.. రూ.1.75 నుంచి రెండు లక్షల వరకు చెల్లించినట్లు ఓ టాక్ వినిపిస్తోంది. అంటే 13 వారాలకు గాను మొత్తంగా సుమారు 25 లక్షల వరకు ప్రియాంక అందుకున్నట్లు సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షోలో తన ప్రదర్శనను బట్టి ఈ పారితోషికం అటు ఇటు ఉండవచ్చని సమాచారం.

Advertisement

Also Read: స్మాల్ స్క్రీన్ పై మ‌హేష్ సంద‌డి.. మ‌హేష్ లో మార్పున‌కు కార‌ణం అదేనా?