Home » స్మాల్ స్క్రీన్ పై మ‌హేష్ సంద‌డి.. మ‌హేష్ లో మార్పున‌కు కార‌ణం అదేనా?

స్మాల్ స్క్రీన్ పై మ‌హేష్ సంద‌డి.. మ‌హేష్ లో మార్పున‌కు కార‌ణం అదేనా?

by Bunty
Ad

ప్రిన్స్ మ‌హేష్ బాబు సాధార‌ణం గా టీవీ ఇంట‌ర్వ్యూ ల‌లో గానీ, సోషల్ మీడియా లో గానీ పెద్ద గా క‌నిపించ‌డు. ఈ మాట ఒక‌ప్పుడు. ఇప్పుడు మ‌హేష్ బాబు స్టైలే మారిపోయింది. స్మాల్ స్క్రీన్ ల‌పై పై తెగ సందడి చేస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా ల‌లో కూడా సూప‌ర్ ఆక్టివ్ గా ఉంటున్నాడు. ఇంతలా మార్పు ప్రిన్స్ మ‌హేష్ బాబు లో ఎందుకు వ‌చ్చిందా.. అనే అనుమానం ప్ర‌తి ఒక్క అభిమానికి వ‌స్తుంది. అయితే గ‌తంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు సినిమా లో త‌ప్పు ఎక్క‌డా క‌నిపించే వాడు కాదు. ఎప్పుడూ త‌న కుటుంబానికి పూర్తి స‌మ‌యం కేటాయిస్తూ.. బ‌య‌ట స‌మాజానికి, అభిమానుల‌కు దూరం గా నే ఉండే వాడు. అంతే కాకుండా ఇత‌ర స్టార్ హీరోల సినిమా ఫంక్ష‌న్ ల‌కు కూడా మ‌హేష్ బాబు హాజ‌రు అయ్యే వాడు కాదు.

Advertisement

Advertisement

కానీ ప్రిన్స్ మ‌హేష్ త‌న పాత ప‌ద్ద‌తి ని పూర్తి గా విడిచి పెట్టాడు. సందు దొరికితే చాలు సోష‌ల్ మీడియా లో పోస్టులు.. హీరో ల సినిమా ల‌కు రావ‌డం.. స్మాల్ స్క్రీన్ ల పై సంద‌డి చేయ‌డం.. ఇలా అభిమానుల ముందుకు టీవీ ల ముందుకు వ‌స్తూనే ఉన్నారు. ఇప్పటి కే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్టు గా వ‌స్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షో లో మ‌హేష్ బాబు సంద‌డి చేశాడు. ఈ ఎపిసోడ్ ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది. మ‌హేష్ రాక తో జెమిని టీవీ టీఆర్పీ రేటింగ్స్ త‌ప్ప కుండా పెరుగుతాయ‌ని ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు యాజ‌మాన్యం భావిస్తుంది.

అలాగే ఆహా లో ప్ర‌సారం అవుతున్న నంద‌మూరి బాల‌య్య అన్ స్టాప‌బుల్ అనే షో కు ప్రిన్స్ మ‌హేష్ బాబు హాజ‌రు అవుతున్నారు. ఈ ఎపిసోడ్ కూడా పూర్తి అయింద‌ని సోషల్ మీడియా లో ఫోటో లు వ‌స్తున్నాయి. అలాగే సోషల్ మీడియా లో వారానికి క‌నీసం నాలుగు నుంచి ఐదు పోస్టు లు పెడుతున్నాడు. ఇలా ఇంత ఆక్టివ్ గా కావ‌డానికి కార‌ణం.. ఈ రోజుల్లో అప్ డేట్ అవుతున్న నూత‌న ప‌ద్ద‌తి ని ఫాలో కావ‌డ‌మే అని అంటున్నారు. ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌కు, అభిమ‌నుల‌కు క‌నిపిస్తే హీరో హైప్ ఇంకా పెరిగి పోతుంది. దీంతో ఆ సూత్రాన్ని న‌మ్ముతూ మ‌హేష్ బాబు ఇలా మారాడ‌ని తెలుస్తుంది.

Visitors Are Also Reading