Telugu News » Blog » నాగ చైతన్య తో విడాకులు : ట్రోలింగ్ పై సమంత కామెంట్ !

నాగ చైతన్య తో విడాకులు : ట్రోలింగ్ పై సమంత కామెంట్ !

by Bunty
Ads

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లేని క్రేజ్ సమంతకు ఉంది. వరుస సినిమాలతో సమంత దూసుకుపోతోంది. అలాగే.. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం.. సోషల్ మీడియాలో ఉన్న ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. అయితే తాజాగా.. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోవడం పై స్వయంగా హీరోయిన్ సమంత తో ఇంటర్వ్యూ లో స్పందించింది.

Advertisement

Advertisement

అందరూ తన నిర్ణయాన్ని.. యాక్సెప్ట్ చేయాలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్న సమంత… ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండాలనే విషయాన్ని కూడా… ఎంకరేజ్ చేస్తాం అని పేర్కొంది. కానీ ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు వారి అభిప్రాయాన్ని నాగరికంగా వ్యక్తం చేయాలని అభ్యర్థిస్తున్నాను అని చెప్పుకొచ్చింది సమంత. కాగా ఏం మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమలో పడిన నాగ చైతన్య- సమంత… 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకుని అభిమానులకు ఆనందాన్ని పంచారు.

Advertisement

కానీ ఈ జంట నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకుంది. దీంతో అక్కినేని ఫ్యామిలీ కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ కు గురయ్యారు. అసలు ఎవరిదీ తప్పు… అనే విషయం క్లారిటీగా చెప్పకుండానే ఈ నిర్ణయాన్ని నాగచైతన్య అలాగే సమంత తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.