Home » ఈ చిన్న టిప్ తో 15 నిమిషాల్లో పెరుగు తయారు చెయ్యండి! ఎలా అంటే?

ఈ చిన్న టిప్ తో 15 నిమిషాల్లో పెరుగు తయారు చెయ్యండి! ఎలా అంటే?

by Srilakshmi Bharathi
Ad

పెరుగు అనేది పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేయబడిన పాల ఉత్పత్తి. వేలాది సంవత్సరాలుగా, ఈ పులియపెట్టిన ఆహారం అనేక సంస్కృతులలో ప్రధానమైనదిగా, బహుళ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిందిగా గుర్తింపు తెచ్చుకుంది.చాలామంది ఎండాకాలం తాజా పెరుగు తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఎండాకాలం సరైన మొత్తం లో పెరుగు తీసుకోవడం కూడా మంచిదే.

curd

Advertisement

అయితే.. పెరుగుని తోడు పెట్టాలి అంటే ముందు రోజు నుంచే ప్రేపిరేషన్ లో ఉంచాలి. కాచి చల్లార్చిన పాలకి కొద్దిగా తోడుకు పెరుగు వేసి రాత్రంతా పులియపెట్టాలి. అప్పటికి కానీ తాజాగా పెరుగు సిద్ధం అవ్వదు. అయితే ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి అంటే కనీసం నాలుగైదు గంటలు పడుతుంది. అందుకే.. మనం ఒక్కోసారి పెరుగు తోడు పెట్టుకోవడం మర్చిపోయినా, లేదా పెరుగు తోడుకోకపోయినా బయట నుంచి తెచ్చేసుకుంటూ ఉంటాం.

curd

Advertisement

ఇక నుంచి ఆ పని చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న టిప్ తో పదిహేను నిమిషాల్లోనే పెరుగుని సిద్ధం చేసేసుకోండి. అయితే ఇందుకోసం నీళ్లు కలపని మీగడ పాలు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఫుల్ క్రీం మిల్క్ పాకెట్స్ ను పెరుగు తోడుపెట్టుకోవడం కోసం వాడండి. ఇంకా ఒక అల్యూమినియం ఫాయిల్ ను కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఒక గిన్నెలో కాచి చల్లార్చిన పాలు పోసి (గోరు వెచ్చగా ఉండాలి) దానికి 2 నుంచి 3 చెంచాల పెరుగు కలపండి. ఈ పెరుగు బాగా కలిసాక గిన్నెను పూర్తిగా ఫాయిల్ పేపర్ తో కప్పేయండి.

curd

మరోవైపు స్టవ్ పై ఒక గిన్నెలో నీటిని వేసి మరిగించండి. అందులో ఒక స్టీల్ స్టాండ్ వేసి ఈ పాల గిన్నెను దానిపై పెట్టండి. పైన మూత పెట్టి స్టవ్ ని సిమ్ లో ఉంచి పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచండి. పదిహేను నిమిషాల్లో పెరుగు సిద్ధం అవుతుంది. ఈ పెరుగు క్రీమీగా ఉంటుంది. కాస్త వేడి చల్లారేవరకు ఆగి తినవచ్చు. అయితే వెంటనే తింటే పెరుగు తియ్యగా ఉంటుంది. మీకు పులుపు కావాలని అనుకుంటే మరికొంత సమయం గడవాల్సి ఉంటుంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

Adipurush: ఆదిపురుష్ చూడటానికి వచ్చిన హనుమాన్‌.. వీడియో వైరల్

రద్దయిన రూ.2 వేల నోట్లను..ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా?

10వ బ్యాట్స్ మెన్ గా వచ్చి.. సెంచరీలు చేసిన క్రికెటర్స్ వీరే..!

Visitors Are Also Reading