Home » తెలంగాణ నుంచి పోటీ చేయనున్న ప్రధాని మోడీ.. నియోజక వర్గం ఇదే..!

తెలంగాణ నుంచి పోటీ చేయనున్న ప్రధాని మోడీ.. నియోజక వర్గం ఇదే..!

by Srilakshmi Bharathi
Ad

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించడంతో లోక్ సభ ఎన్నికలపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తిరిగి పుంజుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కేంద్రం సూచనలతో ముందుకు వెళుతోంది.

Advertisement

లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ సిద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు పెరిగిన నేపథ్యంలో బీజేపీ పెద్ద స్కెచ్ నే వేసినట్లు తెలుస్తోంది. 2019 లో బీజేపీ నాలుగు లోక్ సభ సీట్లను గెలిచింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ 8 సీట్లు గెలవడంతో హై కమాండ్ తెలంగాణపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణతో సహా దక్షిణాది ప్రాంతాలపై కూడా ఈ ప్రభావం పడే విధంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటోంది. ఇందుకోసం తెలంగాణా నుంచి ప్రధానిని పోటీ చేయాలనీ కోరుతోంది.

Advertisement

modi

మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని మోడీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. అయితే.. అందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రధాని పోటీ చేయడం వలన తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి కలిసి వస్తుందని అంటున్నారు. దక్షిణాదిలో బీజేపీ ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ అధికారం లో లేదు. అయితే.. మల్కాజ్ గిరిలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పేర్కొంటూ ఉంటారు. 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచే గెలుపొందారు. ఇక్కడ నుంచి మోడీ పోటీ చేస్తే ఇటు రేవంత్ రెడ్డికి, అటు కేసీఆర్ కి చెక్ పెట్టినట్లు అవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading