Home » స్వ‌ప్న వ‌స్తే గాని మాట్లాడ‌నంటూ మారం చేసిన ప్ర‌భాస్‌.. ఇంత‌కు ఆమె ఎవ‌రో తెలుసా..?

స్వ‌ప్న వ‌స్తే గాని మాట్లాడ‌నంటూ మారం చేసిన ప్ర‌భాస్‌.. ఇంత‌కు ఆమె ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే ఆయ‌న బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. బాహుబ‌లి త‌రువాత తీసిన సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు ప్లాప్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ముఖ్యంగా ప్ర‌భాస్ అంటే ఎప్పుడు ఒక బ్రాండ్ అన్న చందంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ప్రభాస్ క్రేజ్ ని పలు సినిమాల‌ నిర్మాతలు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ‌గా ప్రేమ క‌థ‌ల‌ను తెర‌కెక్కించి హ‌ను రాఘ‌వ‌పూడి సీతారామం సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమా ఇవాళ విడుద‌ల అయింది. దుల్క‌ర్ సల్మాన్‌, మృనాల్ ఠాకూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, సుమంత్ కాంబినేష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది.


ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ స్పీడ‌గానే పెంచారు. ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా నిర్వ‌హించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్ర‌భాస్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యాడు. ప్ర‌భాస్ మాట్లాడేందుకు స్టేజ్ మీద‌కు వ‌చ్చాడు. స్టేజ్ వ‌ద్ద నిల్చొన్న ప్ర‌భాస్ తాను మాట్లాడ‌న‌ని మొండికేశాడు. స్వ‌ప్న వ‌స్తేనే తాను మాట్లాడుతాన‌ని పేర్కొన్నాడు. స్వ‌ప్న ఎక్క‌డున్నా రావాల్సిందే అని ప్ర‌భాస్ మైకులో అరిచాడు. అంత‌లోనే స్వ‌ప్న రాగానే.. ఏంటి మేకింగ్ వీడియోలో ఇలా హీరోయిన్ కంటే ఎక్కువ‌గా షాట్ వేసుకున్నావ్ అని కౌంట‌ర్ వేశాడు ప్ర‌భాస్‌. అంద‌రూ నీ గురించే మాట్లాడుతున్నారేంటి ప్రాజెక్ట్ కోసం ఎంతలా క‌ష్ట‌ప‌డుతున్నావో నాకు తెలుసు. మ‌మ్ముల్ని ముందు పెట్టి నువ్వు వెన‌కాల ఉంటున్నావు ఏంటి..? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడుతాను.. లేదంటే లేదని ప్ర‌భాస్ న‌వ్వులు పూయించాడు.

Advertisement

Advertisement

ఇక స‌మ‌యంలో స్వ‌ప్న‌ద‌త్ మాట్లాడిన త‌రువాత‌నే ప్ర‌భాస్ మాట్లాడి త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకునేలా చేశాడు. ఇక ఈ వెంట్‌లో ప్ర‌భాస్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆయ‌న డ్రెస్సింగ్‌, గాగుల్స్ హైలెట్‌గా నిలిచాయి. అంతేకాదు.. ప్ర‌భాస్ కాలికి స‌ర్జరీ అయిన త‌రువాత తొలిసారిగా ఈ ఈవెంట్‌లోనే క‌నిపించాడు. దీంతో ప్ర‌భాస్ న‌డిచేందుకు ఇబ్బంది ప‌డుతూ క‌నిపించాడు. బ్లాక్ టీ ష‌ర్ట్, డెనిమ్ జీన్స్ ధ‌రించాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్ర‌భాస్ వేసుకున్న స్టైలిష్ గాగుల్స్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్సించింది. అత‌ను ఆడిటోరియంలోకి ఎంట్రి ఇవ్వ‌గానే ఒక్క‌సారిగా అక్క‌డ అంతా పండుగ వాతావ‌ర‌ణ‌మే ఏర్ప‌డింది. ప్ర‌భాస్ క్రేజ్ ఎంత‌లా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read : 

వామ్మో.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను వారు ఆ స‌మ‌యంలో అంత దారుణంగా అవ‌మానించారా..?

“సీతారామం” సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డానికి 5 కార‌ణాలు ఇవేనా..!

Visitors Are Also Reading