Home » వేణుస్వామికి ప్రభాస్ పెద్దమ్మ ఇచ్చిన పంచ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

వేణుస్వామికి ప్రభాస్ పెద్దమ్మ ఇచ్చిన పంచ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

by Anji
Published: Last Updated on
Ad

ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు గారి భార్య  శ్యామలా దేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి పలు సందర్భాల్లో కామెంట్స్ చేయగా.. ఆ మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్భంలో వేణు స్వామిపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ప్రభాస్ ఆరోగ్యం గురించి వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ప్రభాస్ జాతకం గురించివేణు స్వామి చేస్తున్న కామెంట్స్ గురించి తాజాగా శ్యామల దేవి స్పందించారు.

venuswamy-counter-to-prabhas

Advertisement

Advertisement

 

రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆమె మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి చేస్తున్న కామెంట్స్ వింటే బాధ వేస్తుందని చెప్పుకొచ్చారు. వేణు స్వామి క్రేజ్ సంపాదించుకోవడం ప్రభాస్ గురించి నెగిటివ్ గా చెబుతున్నాడని వెల్లడించారు శ్యామలా దేవి. ప్రభాస్ జాతకం ప్రభాస్ తల్లికి మాత్రమే తెలుసు అని.. వేణు స్వామికి ప్రభాస్ జాతకం ఎలా తెలుస్తుందని శ్యామలా దేవి ప్రశ్నించారు.  ప్రభాస్ తనకు పుట్టకపోయినా తన బాబే అని చెప్పారు.  వేణుస్వామి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించారు.

గతంలో వేణుస్వామి ప్రభాస్ పెళ్లి గురించి, సినిమాల గురించి తన కెరియర్ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో కామెంట్స్ చేసారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు. తాజా ఇంటర్వ్యూ ద్వారా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వేణుస్వామికి గట్టి సమాధానం ఇచ్చినట్లైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading