Home » వావ్.. ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది..!

వావ్.. ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది..!

by Anji
Ad

టాలీవుడ్ టాప్ హీరోలంద‌రూ పాన్ ఇండియా లేవ‌ల్ లో సినిమాలు తీస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బాహుబ‌లి, సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాల‌ను పాన్ ఇండియా లేవ‌ల్‌లో విడుద‌ల చేశారు. ఇక ఎన్టీఆర్ ఇటీవ‌లే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టించిన విష‌యం విధిత‌మే. ఆయ‌న న‌ట‌న ఎలా ఉందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అదేవిధంగా మ‌హేష్ బాబు కూడా జ‌క్క‌న్న‌తో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. జ‌క్క‌న్న‌తో సినిమా అంటే ఆ సినిమా ఏరేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విష‌యం విధిత‌మే.

Advertisement

అయితే తాజాగా ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ ముగ్గురు క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది..? ఇక అల్లుఅర్జున్ అతిథి పాత్ర‌లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన కాంబో సినిమా భ‌విష్య‌త్‌లో రావొచ్చేమో కానీ ప్ర‌స్తుతానికి ఆ అవ‌కాశం లేదు. ఆ లోటును తీర్చ‌డానికి ఓ అభిమాని ఈ న‌లుగురితో క‌లిసి ఓ ప్ర‌త్యేక‌మైన వీడియో త‌యారుచేశాడు. ఈ టాలీవుడ్ అగ్ర‌హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించి అంద‌రితో ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఆ వ్య‌క్తి చేసిన ప్ర‌యోగం మరేదో కాదు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ ఫీట్‌. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న సినిమాల్లో విక్ర‌మ్ ఒకటి. ఇక ఇందులో క‌మ‌ల్‌హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించ‌గా.. గెస్ట్ రోల్‌లో సూర్య క‌నిపించి కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి పంచారు.

Advertisement

అడ‌వి అన్నాక సింహం, పులి, చిరుత అన్ని వేట‌కు వెళ్తాయి అనే సంభాష‌ణ‌తో ప్రారంభ‌మ‌య్యే ఈ ట్రైల‌ర్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను న‌మోదు చేసింది. ప్ర‌స్తుతం దానికి స్పూఫ్‌గా వ‌చ్చిన ఈ వీడియో ఆస‌క్తి రేకెత్తిస్తోంది. క‌మ‌ల్ పాత్ర‌లో మ‌హేస్‌, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో ప్ర‌భాస్‌, ప‌హ‌ద్ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌గా.. సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర‌లో అల్లు అర్జున్ ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ హీరోల గ‌త సినిమాల్లోని సంభాష‌ణ‌ల‌కు స‌రిగ్గా సరిపోవ‌డంతో ఈ న‌లుగురు నిజంగా క‌లిసి న‌టించారా..? అనే సందేహం క‌లుగుతుంది. ఎడిటింగ్ అద్భుతం, వావ్‌.. వారెవ్వా అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ‌ల్టీస్టారర్ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఆల‌స్యం ఎందుకు మీరు కూడా చూసేయండి.

Also Read : 

ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ పోస్ట్ వైర‌ల్‌..!

హీరో సుమ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా..? అందులో నిజం ఎంత‌..!

Visitors Are Also Reading