Home » హీరోయిన్ విషయంలో తగ్గేదే లే అంటున్న ప్రభాస్..!

హీరోయిన్ విషయంలో తగ్గేదే లే అంటున్న ప్రభాస్..!

by Azhar
Ad
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. 2016 లో వచ్చిన ఈ సినిమాతో బాలీవుడ్ లో బడా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఇక ఆ తర్వాత వచ్చినా బాహుబలి 2 సినిమా మొత్తం రికార్డులను బ్రేక్ చేయడం వల్ల ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. దాంతో అప్పటి నుండి ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగానే ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు పాన్ ఇండియా సినిమాలను విడుదల చేయగా.. ఇంకా మూడు, నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.
అయితే సినిమాలు ఎలా ఉన్న కూడా ప్రభాస్ మాత్రం హీరోయిన్ విషయంలో తగ్గడం లేదు అని తెలుస్తుంది. ప్రభాస్ ప్రతి సినిమా ఇక్కడ సౌత్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా విడుదల అవుతుంది. అయితే సౌత్ వరకు ప్రభాస్ స్టార్ డమ్ అనేది బాగానే పని చేస్తుంది. కానీ బాలీవుడ్ లో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ఇక తన ప్రతి సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్ ఉండాలని ప్రభాస్ ఆడుతున్నాడట. అలా చేయడం వల్ల హిందీ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవచ్చు అని ప్రభాస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అందుకే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించింది. ఇక ఈ ఏడాది వచ్చిన రాధే శ్యామ్ లో కూడా హిందీలో పాపులారిటీ ఉన్న పూజా హేగ్దే ఉంది. అంతే కాకుండా ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్ అలాగే సాలార్ సినిమాలో శ్రుతిహాసన్ నటిస్తున్నారు. అదే విధంగా ప్రాజెక్ట్ కే తో వస్తున్న సినిమాలో దీపికా పదుకొనెను హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్న సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించనుంది అని తెలుస్తుంది. కానీ ఈ విషయం ఇంకా అధికారింగా ప్రకటించలేదు.

Advertisement

Visitors Are Also Reading