Home » దీపికాకు ప్ర‌భాస్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

దీపికాకు ప్ర‌భాస్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

by Anji
Ad

బాలీవుడ్ అందాల తార దీపికా ప‌దుకొనే కు ఇవాళ త‌న 36 పుట్టిన రోజు కావ‌డంతో ఉద‌యం ట్విట్ట‌ర్‌లో ప‌లువురు ఇప్ప‌టికే దీపిక‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ త‌రుణంల‌నే పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ కూడా దీపికాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీపిక ఫొటోను షేర్ చేస్తూ.. అంద‌మైన న‌వ్వు క‌లిగిన దీపికాప‌దుకొనేకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. నీ ఎన‌ర్జీ, టాలెంట్‌తో ప్రాజెక్ట్‌కె సెట్ మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా మారింది.

 

prabhas

Advertisement

Advertisement

నువ్వు ఎల్ల‌ప్పుడు బెస్ట్‌గా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌ప‌న దీపికా ప‌దుకొనే న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న‌ది. అయితే ప్ర‌భాస్ రాధేశ్యామ్ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల అవుతుంద‌ని అభిమానులంద‌రూ భావించారు. కానీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్ మాదిరిగానే రాధేశ్యామ్ కూడా వాయిదా వేస్తున్న‌ట్టు ఇవాళే చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

 

Visitors Are Also Reading