Home » BRO: “బ్రో” సినిమాలో పూజా హెగ్డే..? టీజర్ లో అది చూసి త్రివిక్రమ్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారుగా!

BRO: “బ్రో” సినిమాలో పూజా హెగ్డే..? టీజర్ లో అది చూసి త్రివిక్రమ్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారుగా!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా వస్తారు అన్నట్లు.. ఈ టీజర్ నిజంగానే ఫ్యాన్స్ దిమాక్ ని ఖుష్ చేసేసింది. ఫ్యాన్స్ నుంచి ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూసిన ఫీలింగ్ వస్తోందని అందరు హ్యాపీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాల గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ని బాగానే వాడుకున్నారని అర్ధం అవుతోంది.

Advertisement

బ్రో టీజర్ లో గమనించాల్సింది ఇంకొక విషయం కూడా ఉంది. ఈ సినిమాలో పూజ హెగ్డే మీకు కనిపించిందా? టీజర్ లో హీరోయిన్ ఎక్కడ ఉందీ? అని ఆలోచిస్తున్నారా.. టీజర్ వచ్చే మొట్టమొదట పూజా హెగ్డే అడ్వర్టైజ్మెంట్ లో నటించిన స్టిల్ ఒకటి కనిపిస్తుంది. పూజ హెగ్డే కనిపించిన తరువాతే టీజర్ ప్రారంభం అవుతుంది. దీనితో నెటిజన్లు త్రివిక్రమ్ ను ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో పెట్టడానికే పూజ హెగ్డేను మహేష్ సినిమా నుంచి తప్పించారా? అంటూ ఫన్నీ గా క్వశ్చన్ చేస్తున్నారు. బ్రో సినిమాకు మాటలు అందించింది త్రివిక్రమ్ అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమా బ్రాండ్ స్టాంప్ ఎలా ఉంటుందో.. అలానే త్రివిక్రమ్ సినిమాల్లో పూజ హెగ్డే కనిపిస్తుందని అంటున్నారు. త్రివిక్రమ్ కు పూజ లక్కీ హీరోయిన్ అనీ.. ఆమె ఉంటె సినిమా హిట్ కాబట్టి బ్రో సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. తమిళ సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్ సినిమాకు బ్రో సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ముఖ్య వార్తలు:

BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

సోంపు గింజలు తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. రోజూ తింటారు..!

ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

Visitors Are Also Reading