Home » ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

by Sravya
Ad

అప్పటి టాప్ హీరోల పేర్లు చెప్పగానే మొదట మనకి గుర్తొచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు. వీళ్ళందరూ కూడా దాదాపుగా మూడు దశాబ్దాలు పాటు సినిమాలు చేశారు. అందరినీ వారి వైపుకి తిప్పుకున్నారు. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వచ్చి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ హీరోలు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు. అదే మనం ఈ తరం వాళ్ళని చూసుకున్నట్లయితే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

అయితే ఒకానొక దశ లో కృష్ణ ఇక సినిమాలు చెయ్యడు అని కృష్ణ పని అయిపోయిందని కామెంట్స్ వచ్చాయి. అప్పుడు కృష్ణ పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమా ఏది అన్న ప్రశ్నకు నెంబర్ వన్ సినిమా పేరే సమాధానం వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా ఆ సినిమా నిలిచింది. ఎంతగానో ప్రేక్షకులకి ఆ సినిమా నచ్చింది. కృష్ణకి జోడిగా ఈ సినిమాలో సౌందర్య నటించి ఆకట్టుకున్నారు. 1994లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి సినిమాల్లో టాప్ గా ఈ సినిమా నిలిచింది.

Advertisement

Advertisement

నెంబర్ వన్ సినిమాకి వారం ముందు ముగ్గురు మొనగాళ్లు సినిమా రిలీజ్ అయింది. అలానే వారం తర్వాత గోవింద గోవింద సినిమా రిలీజ్ అయింది. అయితే ఇలా ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ నెంబర్ వన్ సినిమా మాత్రం సూపర్ కలెక్షన్లు రాబట్టింది. అటు గోవిందా గోవిందా కానీ ఇటు ముగ్గురు మొనగాళ్లు కానీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ చాలా బాగుంది. అందరిని బాగా కామెడీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కృష్ణ డిఫరెంట్ గెటప్స్ వేసుకుని కనబడ్డారు. పైగా యంగ్ గా కనపడి అందర్నీ ఆకట్టుకున్నారు ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు.

Also read:

ఆ సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేయడం వల్లే.. రష్మిక హిట్ కొట్టేసింది..!

బ్రహ్మనందం కోసం మహేష్‌ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసా? దాదాపు 8 సంవత్సరాల తర్వాత?

Visitors Are Also Reading