Home » BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఫాన్స్ దిల్ ఖుష్ చేసారు. ఆయన నటించిన “బ్రో” సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు మోషన్ పోస్టర్లు విడుదల అయ్యాయి. అయితే, టీజర్ రిలీజ్ కాకపోవడంతో ఫాన్స్ మంచి కాకపై ఉన్నారు. అయితే.. టీజర్ విడుదల చేస్తామన్న టైం కి చెయ్యలేదు. టెక్నికల్ ఇష్యూ వచ్చిందని వాయిదా వేసి.. మొత్తానికి నిన్న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకి విడుదల చేసారు.

Advertisement

పవన్ కళ్యాణ్ లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా వస్తారు అన్నట్లు.. ఈ టీజర్ నిజంగానే ఫ్యాన్స్ దిమాక్ ని ఖుష్ చేసేసింది. ఫ్యాన్స్ నుంచి ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూసిన ఫీలింగ్ వస్తోందని అందరు హ్యాపీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాల గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. వాటిని మీరు అబ్సర్వ్ చేసారా? అవేంటో ఇప్పుడు చూసేయండి. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ని బాగానే వాడుకున్నారని అర్ధం అవుతోంది. రీమేక్స్ సినిమాల్లో అయినా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ సరిగ్గా సెట్ అయితే సినిమా పక్క హిట్ అవుతుంది. ఆ టైమింగ్ ఈ టీజర్లో కూడా కనిపించింది. టీజర్ మొదట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు గేటప్ లో కనిపించారు. మధ్యమధ్య లో గమనిస్తే.. పవన్ జల్సా సినిమా పోజ్ ఇచ్చారు.

Advertisement

బ్లాక్ హుడీలో స్టైల్ గా నడుస్తున్నప్పుడు ‘ రా రా బంగారం’ అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుందట. అలా సినిమా అంతా ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ నిండి ఉందట. టీజర్ ఏ రేంజ్ లో ఉందో.. అదే రేంజ్ లో సినిమా కూడా ఉంటె బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే. దర్శకుడు సముద్రఖనిలో ఇంత టాలెంట్ ఉందా అని పవన్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈ టీజర్ కు పవన్ ఫ్యాన్స్ నుంచే కాకుండా.. ఇతర హీరో అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

సోంపు గింజలు తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. రోజూ తింటారు..!

ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

Visitors Are Also Reading