తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరునెల సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో… ఓ పార్టీ నుంచి మరో పార్టీకి కీలక నేతలు జంప్ అవుతున్నారు. అయితే ఎవరు ఎక్కడికిపోయినా… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావులు మాత్రం ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఇంకా మల్ల గొల్లలు పడుతున్నారు. ఇప్పటికీ… ఏ పార్టీలో చేరాలనే దానిపై క్లారిటీకి రాలేకపోతున్నారు.
Advertisement
ఈ తరుణంలోనే… భారతీయ జనతా పార్టీలోకి రావాలని… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లికి ఆహ్వానాలు అందించారు బిజెపి నేత ఈటల రాజేందర్. దీనికోసం ఇప్పటికే పలుసార్లు వారిద్దరితో చర్చించారు ఈటల రాజేందర్. కానీ వాళ్లు అస్సలు కరగలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. బిజెపి పార్టీకి దూరంగా ఉండాలని ఈ ఇద్దరు కి లీడర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు ఈటల రాజేందర్ ను తమతో రావాలని… పొంగులేటి మరియు జూపల్లి కోరుతున్నారు.
Advertisement
తమతో కలిసి వస్తే… ఓ పార్టీ పెట్టి… సీఎం కేసీఆర్ ను ఓడిద్దామని ఈటల రాజేందర్ కు సూచించారట ఇద్దరు లీడర్లు. దీంతో ఈటల రాజేందర్ ఏం చేయాలో తల పట్టుకున్నారట. బిజెపిలో చేరమని నేను అడుగుతే… నాకే కౌన్సిలింగ్ ఇస్తున్నారని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈటల రాజేందర్. ఇది ఇలా ఉండగా… నిజంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు ఇద్దరు కలిసి ఓ పార్టీ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ పెట్టి సీఎం కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేయాలని వీరిద్దరు అనుకుంటున్నారట. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భార్య, భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి !
సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!
ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?