Home » సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!

సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!

by Bunty
Published: Last Updated on
Ad

అలనాటి సీనియర్ నటుడు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సొంతగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోకి వచ్చి… ఓ స్టార్ హీరోగా ఎదిగాడు నందమూరి తారక రామారావు. అక్కడితో ఆగకుండా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఆవిష్కరించారు నందమూరి తారక రామారావు. అనంతరం పార్టీ పెట్టిన సంవత్సరమే ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఎన్టీఆర్.

Advertisement

 

అయితే మనం ఎన్టీఆర్ ను ఇప్పటివరకు నటుడిగా… ముఖ్యమంత్రిగా చూసాం. కానీ గతంలో ఓ పురోహితుడుగా కూడా దర్శనమిచ్చారు నందమూరి తారక రామారావు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే….. అది 1988 సంవత్సరం జూలై 7వ తేదీ. నాగ భైరవ వీరబాబు, పద్మజ దంపతుల వివాహం. వీరి వివాహ కార్యక్రమానికి నందమూరి తారకరామారావు పురోహితుడిగా మారారు. 1988 జులై 7వ తేదీన… ఆరు గంటల 40 నిమిషాలకు వీరి వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. ఒంగోలు పట్టణం రాంనగర్ లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో ఈ కళ్యాణo జరిగింది.

Advertisement

అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ హాజరయ్యారు. దీంతో అక్కడికి జనాలు వేలల్లో వచ్చారు. ఈ తరుణంలోనే పెళ్లి కొడుకు తండ్రి నాగ భైరవ కోటేశ్వరరావు దగ్గరికి వెళ్లిన ఎన్టీఆర్… ఆయన చెవిలో ఏదో చెప్పారు. దీంతో వివాహం వేదిక పైన పురోహితుడు స్టేజి దిగిపోయాడు. అతని స్థానంలో ఎన్టీఆర్ పురోహితుడి అవతారం ఎత్తారు. అనంతరం వారి వివాహం చేశారు. ఇక ఈ ఘటన చూసిన జనాలు ఒక్కసారిగా అవాక్కైపోయారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..

ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?

Visitors Are Also Reading