Home » ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?

ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?

by Bunty

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుసగా సినిమా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హీరోలు అనేక కారణాల వల్ల మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం సినిమా బాగుండి మంచి విజయం సాధించడం సాధారణమే. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోను అలా మిస్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

# ఒక్కడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కడు. అయితే ఈ సినిమా కథను కూడా మొదట ప్రభాస్ విన్నాడు. కానీ కబడ్డీ ఆటపై గ్రిప్ లేకపోవడంతో సినిమాను వదులుకున్న

# నాయక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా నాయక్. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్ళింది. కానీ స్టోరీ నచ్చకపోవడంతో ప్రభాస్ నో చెప్పాడు.

# సింహాద్రి

దర్శకధీరుడు రాజమౌళి చత్రపతి సినిమా కంటే ముందు ప్రభాస్ తో ఓ సినిమా తీయాలనుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాను మొదట ప్రభాస్ కు వినిపించారు. కానీ ప్రభాస్ సింహాద్రి కథ తనకు సెట్ కాదని నో చెప్పాడు.

# ఆర్య

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమా కథను మొదటగా సుకుమార్ ప్రభాస్ కు వినిపించారు. కానీ ప్రభాస్ ఆసక్తి చూపించకపోవడంతో ఆ కథను అల్లు అర్జున్ కు వినిపించి సినిమా తీశారు.

# కిక్

రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా కథను దర్శకుడు సురేందర్ రెడ్డి మొదట ప్రభాస్ తో తీయాలని అనుకున్నాడు. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో సురేందర్ రెడ్డి రవితేజ హీరోగా పెట్టి తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..

ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading