Home » మీకు ఇలా జరుగుతుందా..? అయితే మీకు పితృదోషం ఉన్నట్టే లెక్క..!

మీకు ఇలా జరుగుతుందా..? అయితే మీకు పితృదోషం ఉన్నట్టే లెక్క..!

by Anji
Ad

హిందూ సంప్రదాయం ప్రకారం.. పితృ స్వామ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారు అనేది భారతీయుల నమ్మకం. పూర్వీకుల యొక్క మోక్షం కోసం.. వారి ఆత్మకు శాంతి చేకూరడం కోసం పితృ పక్షంలో శ్రద్ధాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు పూర్వికుల పేరిట దాన, పుణ్య, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. అన్నదానం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. పూర్వికులకు కోపం వస్తే ఇంట్లో అశాంతి నెలకొంటుందని విశ్వసిస్తారు. పూర్వికులు మనపై కోపంగా ఉన్నప్పుడు, ఇంట్లో పలు విధాలుగా విభేదాలు ప్రారంభమవుతాయి. మన తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నప్పుడు లేదా మనపై పితృ దోషం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఇంట్లో గొడవ :

పూర్వికులకు ఇష్టం లేకపోయినా.. మన తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నా ఇంట్లో తరచూ గొడవలు వస్తుంటాయి. ముఖ్యంగా ఎలాంటి కారణం లేకుండానే కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. మీకు కూడా ఇలా జరుగుతుంటే.. దీనికి కారణం పితృదోషం అని గుర్తించుకోవాలి.

ఆరోగ్య సమస్యలు : 

Manam News

పూర్వికుల కోపం వల్ల ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా కుటుంబంలో ఎవరో ఒకరూ నిరంతరం అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ సమస్యలు కొనసాగుతాయి. పితృ దోషం ఉందని తెలుసుకోవడానికి ఇది ప్రధాన లక్షణం. 

Advertisement

ఆంటకాలు ఎదురవ్వడం :

Manam News

మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆ పని మధ్యలోనే ఆగిపోయినా లేదా పనిలో ఒకదాని తరువాత ఒకటిగా సమస్యలు కనిపిస్తాయి. అది పితృదోషం లక్షణమే కావచ్చు. పితృదోషం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోవడం సర్వసాధారణంగా మారుతుంది. పితృ దోషం ఓ వ్యక్తి పురోగతికి సమస్యలను కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి. 

సంతాన సమస్యలు :

Manam News

పితృదోషం కారణంగా కుటుంబంలో పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో భార్య,భర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ సంతానం కలుగకుండా ఉంటే అది పితృ దోషానికి సంకేతం. 

పెళ్లికి ఆటంకం :

Manam News

మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా పెళ్లికి అడ్డంకులు ఎదురైతే.. అది పితృదోషానికి సంకేతం. పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యులకు పెళ్లి కాకపోవడం.. పెళ్లి తరువాత వారి బంధంలో సమస్యలు లేదా వివాహం కుదిరిన తరువాత చెడిపోవడం కూడా పితృదోషం లక్షణాలే అని గుర్తించుకోవాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆలోచించి ఖర్చు చేయండి

కొత్తరకం రెమ్యూనరేషన్ ప్లాన్ చేసిన శ్రీ లీల… అదేంటో తెలుసా..?

ఆ కారణంతో బాలకృష్ణ మూవీని రిజెక్ట్ చేసిన రమ్యకృష్ణ… ఆ తర్వాత ఆమె స్థానంలో క్రేజీ నటి..!

Visitors Are Also Reading