మనిషికి మనిషికి మధ్య అంతరం పెరుగుతుంది. టెక్నాలజి గుప్పిట్లో మానవ సంబంధాలు అడిగిడిపోతున్నాయి. ఇది ఎంతటి పతనానికి దారి తీస్తుందో ఊహకు అందడం లేదు. కళ్ల ఎదుట పక్కవాడి ప్రాణం పోతున్నా.. ఆఫీస్‌కు టైమ్ అవుతుందని పరుగులు పెడుతున్న యాంత్రిక జీవితంలో ఎమోషన్స్‌కు చోటు దొరకడం కష్టం అయిపోయింది. దానికి తగ్గట్టు ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా తాత్కాలిక ఉపయోగాన్ని టార్గెట్ చేస్తూ.. డబ్బులు రావడమే పరమావధిగా అర్థం పర్థం లేని కాన్సెప్ట్‌తో సినిమాలను తీస్తున్నారు. కానీ పాతికేళ్ల కిందట మనుషుల మధ్య అనుబంధాల గొప్పతనాన్ని అద్భతంగా తెరపై ఆవిష్కరిస్తూ ఉమ్మడి కుటుంబానికి, పెద్దరికానికి ఇవ్వాల్సిన గౌరవానికి ఉన్న విలువ గురించి తీసిన చిత్రమే పెదరాయుడు.
Also Read: “నువ్వు నాకు నచ్చావ్” పింకీ ఎలా ఉందో తెలుసా..?
Advertisement
1994లో తమిళంలో నాట్టమై అనే సినిమా ఒకటి వచ్చింది. గ్రామ పెద్ద షన్ముకం, అతని తమ్ముడు పశుపతిగా డ్యుయల్ రోల్‌లో నటించారు. ప్లాష్‌బాక్‌లో వీరి తండ్రిగా విజయ్ కుమార్ నటించారు. సుందర్ అందించిన కథకు కే.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సిల్వర్ జూబ్లీ ఆడటంతో పాటు ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆర్.బీ.చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా చూసి ఆకర్షితుడైన సూపర్‌స్టార్ రజనీకాంత్ వెంటనే తన స్నేహితుడు మోహన్‌బాబు ఆఘ మేఘాల మీద ఫోన్ చేసి ఆ హక్కులు కొనేలా చేశారు. అంతేకాదు.. చిన్నదైన సారి సెకండ్ హాప్‌లో వచ్చే రాయుడు పాత్ర వేస్తానని హామీ ఇచ్చారు. అప్పటికే వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్నారు మోహన్‌బాబు.
Also Read: వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!
స్నేహితుడి మాట కాదనలేక కొనేశారు. రీమేక్‌లో సిద్ధహస్తుడైన రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా తీసుకున్నారు. లైప్ అండ్ డెత్ గేమ్‌లాగా తన సొంత బ్యానర్ మీదే ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు మోహన్‌బాబు. ఇక తరువాత జరిగింది సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర. కథ పెద రాయుడు అనగా మోహన్‌బాబు. ఆ ముగ్గురికి పెద్ద. ఎవరికీ ఏ తగాదా, సమస్య వచ్చినా అతని తీర్పే వేదం. ఇద్దరు తమ్ముళ్లు.. రాజా, రవీంద్ర, పెదరాయుడు భార్య లక్ష్మీ భానుప్రియ. రాజా సౌందర్యను పెళ్లి చేసుకుంటాడు. అనవసరంగా ఏర్పడిన భారతి వల్ల ఏర్పడిన కలకలహాలను పెదరాయుడు చక్కదిద్దాడు. ఆ ఊరికి టీచర్ గా శుభ శ్రీ వస్తుంది. రాజాతో ఉద్దేశపూర్వకంగా, సన్నిహితంగా ఉండటం అందరి కంట పడుతుంది.
Advertisement
ఒక రోజు ఆమె హత్యకు గురైతే.. ఆ అబాండం రాజా మీద పడి నియమాల ప్రకారం.. ఊరి నుంచి వెళ్లివేయబడతాడు. ఈ సందర్భంలోనే చనిపోయిన పెదరాయుడు తండ్రి పాపారాయుడు అనగా రజనీకాంత్ గురించి తెలుస్తోంది. న్యాయం కోసం బంధుత్వాన్ని లెక్కచేయకుండా ఆనందరాజు కుటుంబానికి ఊరి నుంచి వెళివేసే శిక్ష, ప్రాణత్యాగం చేసే ఘటన గుర్తుకు వస్తుంది. దానికి ప్రతీకారంగా పశుపతి రాజాను ఇరికిస్తాడు. చివరిలో పెదరాయుడు రాజా తప్పు ఏమి లేదని తెలుసుకుని తన తప్పుడు తీర్పుకు ప్రాయచిత్తంగా పెదరాయుడు ప్రాణాలను వదిలివేస్తాడు. రాజా ఆ బాధ్యత తీసుకోవడంతో కథ ముగుస్తుంది. పెదరాయుడు సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ పాత్రలో ఇంకొకరినీ ఊహించుకోవడం కష్టం అనే రీతిలో ఆ పాత్రకు జీవం పోశారు కళాపపూర్ణ మోహన్‌బాబు. తనను కలెక్షన్ కింగ్ ఎందుకు అంటారో ఈ చిత్రం ద్వారా రుజువు చేశాడు.
Also Read : బిగ్ బాస్ ఓటీటీకి డేట్ ఫిక్స్..కంటెస్టెంట్స్ వీళ్లే..!
పెదరాయుడుగా మోహన్ బాబు వేసిన ముద్ర అప్పట్లో చాలా కాలం వెంటాడడం వల్లే అలాంటి పాత్రలు మరికొన్ని వేసినా అంతగా ఆకట్టుకోలేదు. అంత గొప్పగా ఆ పాత్రలో జీవించారు మోహన్‌బాబు. భానుప్రియ తన కెరీర్‌లోనే ఒక మంచి పాత్ర దొరికింది. ఈ చిత్రంలో భారతిగా సౌందర్య కూడా అద్భుతంగా నటించింది. ఇందులో ఆమె నటించిన తీరుతో ఆమెను కొందరు సావిత్రితో పోల్చారు అప్పట్లో. రాజా రవీంద్ర, ఎం.ఎస్.నారాయణ, కైకాల సత్యనారాయణ, జయంతి, చలపతిరావు, సుప్రజ, బ్రహ్మనందం, బాబు మోహన్, మెయిన్ విలన్ ఆనంద్‌రాజు ఆయా పాత్రలకు అతికినట్టు సరిపోవడంతో పాటు దర్శకునికి కావాల్సిన ఔట్‌పుట్‌ను నూటికి నూరు శాతం ఇచ్చారు. వీరందరూ ఒక ఎత్తయితే ప్లాష్‌బాక్‌లో 20 నిమిషాల పాటు పాపారాయుడు పాత్రలో చెలరేగిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ఎత్తు. రజీనికాంత్ ఎపిసోడ్ కోసమే ఒకటికి పది సార్లు సినిమాను చూసిన వాళ్లున్నారంటే.. అతిశయోక్తి కాదు.
జూన్ 15 1995 పెదరాయుడు విడుదల అయింది. అంచనాలు మామూలుగానే ఉన్నాయి. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి బిగ్‌బాస్ విడుదల అయింది. మెగాస్టార్ దెబ్బకు పెదరాయుడు నిలబడుతుందా అనుకున్నారు అంతా. కానీ మొదటి వారంలోనే సీన్ రివర్స్. రెండు, మూడు రోజులు గడిచాయి. క్రమ క్రమంగా సినిమా హాళ్లు బిగ్‌బాస్‌కు తగ్గి పెదరాయుడుకి పెరిగాయి. ముఖ్యంగా థియేటర్లు పెరిగినా టికెట్ల కోసం జనాలు కొట్టుకున్నారు. ప్రింట్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. డబ్బు లెక్కపెట్టుకోవడానికి మిషన్లు కావాలి అనేంతగా కలెక్షన్లు వచ్చాయి. ఈ ధాటిని తట్టుకోలేకపోవడంతో.. చిరంజీవి బిగ్‌బాస్ జెండా ఎత్తాడు. అప్పటిదాకా ఘరానా మొగుడు సినిమాపై ఉన్న రికార్డులన్నింటీనీ పెదరాయుడు తిరగరాసింది. 39 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కుటుంబంలో పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 25 సంవత్సరాలు నిండినా పెదరాయుడు ఇప్పటికీ నిత్య యవ్వనుడే అని చెప్పవచ్చు.
Also Read : “ఖిలాడీ” మసాలా సాంగ్ విడుదల