Home » “నువ్వు నాకు నచ్చావ్” పింకీ ఎలా ఉందో తెలుసా..?

“నువ్వు నాకు నచ్చావ్” పింకీ ఎలా ఉందో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో “నువ్వు నాకు నచ్చావ్” ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా ఆర్తీ అగర్వాల్ నటించి అలరించింది. అప్పట్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోతుంటారు. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను యూత్ ను ఎంతగానో మెప్పించింది.

Advertisement

సినిమాలో వెంకటేష్ ఆర్తీ అగర్వాల్ మధ్య ఉండే కెమిస్ట్రీ అదే విధంగా ప్రకాష్ రాజ్ నటన సినిమా లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో మరో గుర్తుండి పోయే పాత్ర పింకీ… ఆర్తీ అగర్వాల్ చెల్లిగా నటించిన పింకీ పాత్ర కూడా ప్రేక్షకులను తమవైపు తిప్పుకుంది. వెంకీ కి పింకీ పంచులు వేయడం….అక్క పై జోకులు వేయడం చూస్తే పక్కింటి అమ్మయిలానే కనిపించింది.

Also Read:  ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ఫోటో గ్యాలరీ ..!

Advertisement

ఇదిలా ఉంటే నువ్వు నాకు నచ్చావ్ లో పింకీ గా అలరించిన నటి అసలు పేరు సుదీవ. అయితే నువ్వు నాకు నచ్చావ్ సినిమా తరవాత మాత్రం ఆమె అసలు పేరు ను పట్టించుకోకుండా పింకీగానే పిలవడం మొదలు పెట్టారు. ఇక పింకీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కు చెందిన కళాకారుల కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. పింకీ తాత కిలాడీ నృత్యం ద్వారా ఎంతో పాపలారిటీ సంపాదించుకున్నారు. సినిమావాళ్ల తో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.

దాంతో పింకీ కి మొదటి సారి 1994 లో మోహన్ బాబు హీరోగా నటించిన ఎం. ధర్మరాజు ఎం ఏ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఐదేళ్ల వయసులోనే ఈ చిత్రంలో రంబ చెల్లెలి పాత్రలో నటించి సుదీవ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరవాత సుదీవ కు మా అన్నయ్య …అల్లుడు వచ్చారు అనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ పింకీ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా తరవత వరుసగా బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లెజెండ్ చిత్రాలలో నటించింది. అంతే కాకుండా పలు సీరియల్స్ లోనూ సుదీవ నటించి అలరించింది. ఇక ఆ తరవాత తన చదువును పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లాడి హైదరబాద్ లోనే సెటిల్ అయ్యింది.

Also Read: సుధీర్ అసలు పేరు తెలుసా…జబర్దస్త్ కు ముందు ఏం చేశాడో తెలుసా..?

Visitors Are Also Reading