Home » “ఖిలాడీ” మసాలా సాంగ్ విడుద‌ల

“ఖిలాడీ” మసాలా సాంగ్ విడుద‌ల

by Anji
Ad

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజాగా చేస్తున్న సినిమా యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఖిలాడీ. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను ఏ స్టూడియోస్‌లో ఎల్ఎల్పీ ప‌తాకంపై స‌త్య‌నార‌య‌ణ కోనేరు, వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సౌండ్ ట్రాక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవీశ్రీ ప్ర‌సాద్ స్వ‌రప‌రుచుతున్నారు.


ముఖ్యంగా ఇందులో యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, ముకుంద‌న్‌, మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే తాజాగా కిలాడి మూవీ నుంచి మ‌రొక అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ చిత్రం నుంచి 5వ పాట‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర బృందం. క్యాచ్ మీ అనే 5వ సాంగ్‌ను ఫిబ్ర‌వ‌రి 05న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన‌ది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ కూడా వ‌దిలారు మూవీ మేక‌ర్స్‌. కాగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమాపై భారీ అంచెనాలే పెట్టుకున్నారు అభిమానులు.

Advertisement

Advertisement

Also Read :  బిగ్ బాస్ ఓటీటీకి డేట్ ఫిక్స్..కంటెస్టెంట్స్ వీళ్లే..!

టాలీవుడ్ కంటెంట్ బాలీవుడ్ బాగా ఆస‌క్తిగా ఉంది. బాహుబ‌లి, సాహో, పుష్ప లాంటి సినిమాలు తెలుగు సినిమా బాలీవుడ్‌లో బాగా పెంచేశాయి. మ‌న సినిమాలు చూడ‌డానికి అక్క‌డి ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు. డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేసిన కూడా అద్భుత‌మైన విజ‌యం ఇస్తున్నారు. మొన్న విడుద‌లైన పుష్ప ఏకంగా 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన‌ది. క‌నీసం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండా విడుద‌ల చేసిన అల్లుఅర్జున్ పుష్ప సినిమాను ఉత్తారాది ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు మిగిలిన సినిమాల‌ను కూడా హిందీలో డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ త‌రుణంలో ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ర‌వితేజ ఖిలాడి చిత్రాన్ని హిందీలో డ‌బ్ చేస్తున్నారు.

Also Read :  చిరంజీవికి ఎన్టీఆర్ ఏ విధంగా సహాయపడ్డారో తెలుసా ..?

Visitors Are Also Reading