Telugu News » Blog » బిగ్ బాస్ ఓటీటీకి డేట్ ఫిక్స్..కంటెస్టెంట్స్ వీళ్లే..!

బిగ్ బాస్ ఓటీటీకి డేట్ ఫిక్స్..కంటెస్టెంట్స్ వీళ్లే..!

by AJAY

బిగ్ బాస్ సీజ‌న్ 5 పూర్త‌యిన వెంట‌నే సీజ‌న్ సిక్స్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 6 ఓటీటీలో ప్రసారం కానుంది అని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో ఎక్జైటింగ్ మ‌రింత పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఓటీటీ బిగ్ బాస్ వ‌స్తుందా అని బిగ్ బాస్ ప్రియులు కండ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు.

Advertisement

bigg boss telugu 6

bigg boss telugu 6

ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం అనుకున్న‌దానికంటే ముందే బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీ నుండి బిగ్ బాస్ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. అంతే కాకుండా ఈ నెల రెండో వారం లోప‌లే ప్రోమో కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఓటీటీలో 24 గంట‌ల పాటు బిగ్ బాస్ ప్ర‌సారం కానుండ‌గా ఈ సారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Advertisement

bigg boss telugu ott

bigg boss telugu ott

ఇదిలా ఉండ‌గా ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్ లుగా యాంక‌ర్ శివ, వ‌ర్షిని, ఢీ విన్న‌ర్ రాజు, టిక్ టాక్ దుర్గారావు, ముమైత్ ఖాన్, ఆద‌ర్శ్, త‌నిష్, ధ‌న్ రాజ్, సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్ ఫేమ్ వైష్ణ‌వి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హిందీలో ఓటీటీ బిగ్ బాస్ ప్ర‌సారం అవుతుండ‌గా అక్క‌డ మంచి స‌క్సెస్ అందుకుంది. మ‌రి తెలుగులో బిగ్ బాస్ ఓటిటి ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తుందో చూడాలి.