Home » BoyapatiRAPO : దున్నపోతుతో రామ్ ఎంట్రీ అదుర్స్…. మాస్ కు ఫ్యాన్స్ కు జాతరే

BoyapatiRAPO : దున్నపోతుతో రామ్ ఎంట్రీ అదుర్స్…. మాస్ కు ఫ్యాన్స్ కు జాతరే

by Bunty
Ad

దేవదాసు సినిమాతో తెలుగు సినిమాల్లోకి రామ్ పోతినేని ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు గోవా బ్యూటీ ఇలియానా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రామ్ ఆ తర్వాత వరుసగా రకరకాల సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ పోస్టర్ ఆడియన్స్ అని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేడు పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని విడుదల చేసి రామ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు.

Advertisement

ఇక గ్లింప్స్ విషయానికి వస్తే ఫస్ట్ తండర్ ఓపెనింగ్ లో రామ్ పెద్ద కత్తితో నడుచుకుంటూ వస్తూ కనిపించారు. బాంబు పేలుడు దాటికి జీపులోని విలన్స్ అంతా కత్తులతో చెల్లాచెదురుగా పడతారు. ఆ తర్వాత దున్నపోతును పట్టుకొని సదర్ ఉత్సవంలోకి రామ్ ఎంట్రీ ఇస్తారు. “నీ గేటు దాటలేను అన్నావ్, దాటా. నీ గేటు దాటలేను అన్నావ్, దాటా, నీ పవర్ దాటలేను అన్నావు, దాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అంటూ రాంచరణ్ చెప్పే మాసీ డైలాగ్స్ అదిరిపోయాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Visitors Are Also Reading