Home » రెమ్యూన‌రేష‌న్‌ను భారీగా పెంచిన‌ ప‌విత్ర లోకేష్.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

రెమ్యూన‌రేష‌న్‌ను భారీగా పెంచిన‌ ప‌విత్ర లోకేష్.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

by Anji
Ad

ప‌విత్రా లోకేష్ గురించి ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సెన్సేష‌న్ అయింద‌నే చెప్పాలి. ఈవిడ క‌ర్ణాట‌క చెందిన న‌టి అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లో సైడ్ క్యారెక్ట‌ర్లు చేస్తున్నా.. ఈమె అక్క‌, త‌ల్లి, వ‌దిన ఇలా ప‌లు పాత్ర‌ల్లో న‌టిస్తోంది. టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌తో ప్రేమ, పెళ్లి, స‌హ‌జీవ‌నం, స్నేహం అంటూ ర‌క‌ర‌కాల వివాదాల‌తో ఆమె వార్త‌ల్లో నిలిచిన విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలోనే ఆమె రెమ్యూన‌రేష‌న్ ను భారీగానే పెంచేసింద‌ట‌.

Advertisement

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు ప‌విత్రా లోకేష్‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో న‌రేష్ తో రిలేష‌న్ షిప్ ఉండ‌గా ఒక్క‌సారిగా సెన్సేష‌న్ అయ్యారు. ఇక సోష‌ల్ మీడియాలో ప‌విత్రా లోకేష్ పేరు మారు మ్రోగిపోతుంది. ఇది వ‌ర‌కు ఈమె పేరు అంత‌గా ప‌రిచ‌యం లేదు. కానీ న‌రేష్ తో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ప్ప‌టి నుంచి చాలా పాపుల‌ర్ అయ్యారు. అంతేకాదు.. ఆ మ‌ధ్య మైసూర్‌లో ఓ హోట‌ల్ రూమ్ న‌రేష్ తో క‌లిసి ప‌విత్ర లోకేష్ క‌నిపించ‌డంతో ఈమె ఇమేజ్ కాస్తా ప‌డిపోయింది. ఈ వివాదం వ‌ల్ల టాలీవుడ్‌లో ఆమె సినిమాలు నిలిచిపోతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. ప‌విత్రా లోకేష్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు.

Advertisement

ఇటీవ‌ల వ‌చ్చిన‌ ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ప‌విత్ర లోకేష్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు ఆమె రెమ్యూన‌రేష‌న్ పెంచిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు ప‌విత్రా లోకేష్ ఒక్క‌రోజుకి 60వేల రెమ్యూన‌రేష‌న్ తీసుకునేవార‌ట‌. ప్ర‌స్తుతం అది కాస్తా రోజుకు ల‌క్ష రూపాయ‌ల‌కు పెంచిన‌ట్టు తెలుస్తోంది. క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌విత్రా లోకేష్ టాలీవుడ్ లో త‌న‌కు వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్ ను అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది. మొద‌ట‌లో చాలా త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న ఈమె.. ఇప్పుడు డిమాండ్ పెరిగే స‌రికి రేటు పెంచేసింద‌ట‌. ప‌విత్రా లోకేష్‌కు సినిమా ఆఫ‌ర్లు పెర‌గ‌డానికి అటు న‌రేష్ కూడా హెల్ప్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

Also Read : 

బింబిసార ఫ‌స్ట్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?

ఆ తెలుగు హీరోతో సినిమా చేయాలనుకుంటున్న జాన్వీ కపూర్..!

 

Visitors Are Also Reading