Home » బాహుబ‌లి-2 ను వెన‌క్కినెట్టేసిన‌ ప‌ఠాన్…!

బాహుబ‌లి-2 ను వెన‌క్కినెట్టేసిన‌ ప‌ఠాన్…!

by AJAY
Ad

చాలా కాలం నుండి బాలీవుడ్ కు బ్యాడ్ టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సౌత్ నుండి వ‌చ్చే సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్ రికార్డులు క్రియేట్ చేస్తుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రుస్తూనే వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ ప్రేక్ష‌కులు అక్క‌డి హీరోల‌పై మేక‌ర్స్ పై విమర్శ‌లు కురిపిస్తునే ఉన్నారు. ఇక బాలీవుడ్ అంతా వేయి కండ్ల‌తో ఎదురు చూసిన సినిమా ప‌ఠాన్.

Advertisement

 

షారుక్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా పైనే బాలీవుడ్ ప్రియులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా కూడా వారిని నిరాశ‌ప‌ర‌చ‌లేదు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అంతే కాకుండా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో పాటూ క‌లెక్ష‌న్స్ కూడా భారీగానే వ‌స్తున్నాయి.

Advertisement

అంతే కాకుండా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన బాహుబ‌లి సినిమాను సైతం బీట్ చేసింది. ఇప్ప‌టి వ‌రకూ బాలీవుడ్ లో కూడా అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా బాహుబ‌లి 2 ఉండేది ఈ సినిమా రూ.511 కోట్ల‌ను వ‌సూళు చేసి నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరింది. అయితే ఇప్పుడు ప‌ఠాన్ ఆ రికార్డుల‌ను బ్రేక్ చేసింది.

రూ.513 కోట్ల‌ను వ‌సూళు చేసి హిందీ టాప్ వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమా గా నిలిచింది. దాంతో బాలీవుడ్ కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయి. అంతే కాకుండా బాలీవుడ్ సినిమా ల‌వ‌ర్స్ కూడా కుషీ అవుతున్నారు. ప‌ఠాన్ బాహుబ‌లిని హిందీలో బీట్ చేయ‌డంతో బాహుబ‌లి నిర్మాత శోభుయార్ల‌గ‌డ్డ ప‌ఠాన్ సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ALSO READ : హోలీ పండుగ ఎందుకు జరుపుతారు…దాని ప్రత్యేకతలు ఏంటీ

Visitors Are Also Reading