Home » హోలీ పండుగ ఎందుకు జరుపుతారు…దాని ప్రత్యేకతలు ఏంటీ

హోలీ పండుగ ఎందుకు జరుపుతారు…దాని ప్రత్యేకతలు ఏంటీ

by Bunty
Ad

హోలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోలీ అనేది రంగుల పండుగ. హిందువుల వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోనే పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ లలో దీన్ని దోల్యాత్ర లేదా బసంత-ఉత్సాబ్ అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.

READ ALSO : సూపర్ స్టార్ కృష్ణ.. మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో ఎందుకు ఉండేవాడు ?

Advertisement

ఈ పండుగరోజు దాదాపు ఈ ప్రాంతాలు అన్నీ పండుగ సందడితో ఉంటాయి. ఈరోజు ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుని పండుగ చేసుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలీక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలీకా దహన అంటారు. దీనికి పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటారు. అయితే, హోలీ ఎందుకు జరుపుతారు ఇప్పుడు తెలుసుకుందాం. హిరణ్యకశిపుని కుమారుడు భక్త ప్రహ్లాదుడు. అతను విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు శివ భక్తుడు.

Advertisement

read also : నీచ్ కమీన్ కుత్తే… KGF పై తెలుగు డైరెక్టర్ దారుణ వ్యాఖ్యలు

 

తన కుమారుడు ప్రహ్లాదుడు ఎన్నిసార్లు చెప్పినా విష్ణు నామం జపిస్తూ ఉన్నాడని ప్రహ్లాదునికి ప్రాణం తీయాలనుకున్నాడు. హిరణ్యకశిపుని సోదరి హోలీక. ఆమెకు ఒక వరం ఉంది. అగ్నిలో దూకిన ఆమె ప్రాణాలకు ఏమీ కాదు. అప్పుడు హోలీక ప్రహ్లాదుడుని తన వడిలో కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి మహిమ వల్ల ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. హోలీకా అగ్నికి ఆహుతి అవుతుంది. దీంతో రాక్షస జాతికి చెందిన హోలీకా మరణించిన దానికి గుర్తుగా హోలీ జరుపుకుంటారని అంటుంటారు.

read also : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Visitors Are Also Reading