Home » క్రికెట్ లోనే అనుకున్నాం..సినిమాల విషయంలో కూడా పాక్ వక్రబుద్ధి బయటపడిందా..?

క్రికెట్ లోనే అనుకున్నాం..సినిమాల విషయంలో కూడా పాక్ వక్రబుద్ధి బయటపడిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

భారత్ పాకిస్తాన్ టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనపై పాకిస్తాన్ పై చేయి సాధించాలని చూస్తూనే ఉంటుంది. ఏదైనా సమయం దొరికిందంటే ట్రోల్స్ చేయడానికి కూడా వెనకాడదు. మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత రసవతారంగా సాగిందో మనందరికీ తెలుసు. మరో విషయంలో పాక్ తన దుర్బుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్లో ఆర్ఆర్ఆర్ సినిమాపై కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అబద్ధాలు చెబుతూ సినీ ప్రేక్షకులను మాయ చేస్తుందని చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర తిరగరాసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని తన సినిమా బీట్ చేసిందని పాకిస్తాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రచారం చేస్తోంది. నిజంగానే ఆ చిత్రం త్రిబుల్ ఆర్ సినిమాను బీట్ చేసిందా.. ఒకవేళ చేసి ఉంటే.. ఈ విషయాన్ని పాకిస్తాన్ నిర్మణ సంస్థ బయటకు చెప్పడం, వాళ్లపై విమర్శలకు కారణమైంది. ఫనాద్ ఖాన్, మహీరా ఖాన్ హీరో హీరోయిన్లుగా “ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జట్ ” చిత్రాన్ని తీశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ మూవీ యూకేలో ఆర్ఆర్ఆర్ లైఫ్ టైం బాక్సాఫీస్ రెవెన్యూని 17 రోజుల్లో వసూలు చేసిందని పాకిస్తాన్ నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు.

Advertisement

also read:రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు..ఎవ‌రెవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇక ప్రొడ్యూసర్ మార్కెటింగ్ ట్రిక్.. ఇండియా ప్రేక్షకులకు కోపం తెప్పించింది.. క్రికెట్ లోనే కాకుండా సినిమాల విషయంలో కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారని కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. కట్ చేస్తే పాక్ సినీ ప్రేక్షకులు మాత్రం “ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జట్” చిత్రం బాగుందని ప్రశంసిస్తున్నారు.. కథ అదిరిపోయిందని, పాకిస్తాన్ ప్రజలు గర్వించదగ్గ మూవీ అని అంటున్నారు. యూకే లో ఆర్ ఆర్ఆర్ 100 కోట్ల కలెక్షన్ సాధించింది. పాక్ మూవీ కలెక్షన్స్ మాత్రం బయట పెట్టలేదు. సెన్సార్ నిబంధనలో కఠినంగా ఉన్నప్పటికీ పాక్ సినిమా తీసిన ఆ మూవీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గొప్ప విషయమే. కానీ భారతీయ చిత్రాన్ని తమది బీట్ చేసింది అని చెప్పుకోవడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్ల అభిప్రాయం.

also read:

Visitors Are Also Reading