Home » రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు..ఎవ‌రెవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు..ఎవ‌రెవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల స్టామినా పెరిగిపోయింది. గతంలో తెలుగు సినిమాలను ఏపీ, తెలంగాణలో మాత్రమే విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ సినిమాలను ఇష్టపడుతున్న ప్రేక్షకులు కూడా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో సినిమాలకు కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. దాంతో హీరోలు కూడా రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు. తాజాగా టాలీవుడ్ టాక్ ప్రకారం ఏ హీరో ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ టాలీవుడ్ లోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్న అల్లు అర్జున్ సైతం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 75 కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఒక్కో సినిమాకు 70 కోట్లు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు కూడా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

టాలీవుడ్ లో టాప్ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పవన్ ఒక్కో సినిమాకు 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా మహేష్ బాబు సైతం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading