Home » ఇండియన్ సినిమాలపై పాక్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్..!

ఇండియన్ సినిమాలపై పాక్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్..!

by Anji
Ad

ప్రస్తుత కాలంలో ఇండియన్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. జాతీయ కథలను తెలుసుకోవడానికి ప్రపంచ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇతర దేశాలలో కూడా మన సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. అయితే మన పొరుగు దేశం పాకిస్తాన్ లో మాత్రం ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధించి కూర్చున్నారు. తాజాగా ఈ విషయం గురించి పాక్ నటుడు మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ప్రముఖ పాకిస్తాన్ని నటుడు, నిర్మాత ఫైసల్ ఖురేషీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ లో సినిమా పరిశ్రమ బ్రతికి ఉండాలి అంటే ఇండియన్ సినిమా రిలీజ్ అవ్వాలి.

Advertisement

ముఖ్యంగా ఇండియన్ సినిమా రిలీజ్ పై పాక్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించాలి. నాకు నా దేశం పై భక్తి ఉంది. కానీ, పాకిస్తాన్ లో సినిమా పరిశ్రమ కొనసాగాలంటే కచ్చితంగా ఇండియన్ సినిమా రిలీజ్ అవ్వాలి. లేకపోతే చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలకి ఇండియన్ చిత్రాలపై ఎంతో ఆసక్తి ఉంది. భారతీయ సినిమాల రిలీజ్ ల వల్ల గతంలో పాకిస్తాన్ ఏడాదికి రూ. 6 వేల కోట్లకు పైగా లాభాన్ని పొందేది. అంతేకాదు పాక్ ప్రజలు కూడా ఇండియన్ సినిమాలు రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. ఆ ఆసక్తితోనే ఇక్కడ ప్రజలు ఓటీటీలో ప్రతి ఇండియన్ సినిమాని కూడా ఆదర్శిస్తున్నారు. ఈ సినిమాలు ఇక్కడి అందరికీ తెలుసు అని వెల్లడించారు. భారతీయ సినిమాల విడుదలపై నిషేధం ఎత్తివేసినప్పుడే పరిశ్రమ బాగుపడుతుంది.


అంతేకాదు.. భారత్ తో మన సంబంధాలను మెరుగుపరిచేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా మన కంటెంట్ ని కూడా ఆ దేశంలో స్ట్రీమింగ్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది అంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ఒక పాక్ నటుడు ఇండియన్ సినిమాల గురించి ఇంత గొప్పగా కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే 2019 నుంచి పాకిస్తాన్ థియేటర్లలో ఇండియన్ సినిమాల విడుదలపై నిషేధం వేసిన విషయం తెలిసిందే. మరీ అక్కడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే ఇండియన్ సినిమాలు విడుదల చేయాల్సిందే. మరి దీనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading